బాబుకు బ్యాండ్ ఏస్తున్న బన్నీ.. ఎక్కడో తెలుసా?  

Ala Vaikuntapuramulo Surpasses Sarileru Neekevvaru Priemere Record In Overseas-overseas,priemere Show,sarileru Neekevvaru

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు కేవలం ఒక్కరోజు తేడాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ అయ్యింది.

Ala Vaikuntapuramulo Surpasses Sarileru Neekevvaru Priemere Record In Overseas-Overseas Priemere Show

ఈ సినిమాకు ఏకంగా బ్లాక్‌బస్టర్ టాక్ వినిపిస్తోంది.అయితే ఒక్కరోజు తేడాతో రిలీజ్ అయిన ఈ రెండు సినిమాల్లో ఓవర్సీస్ విన్నర్ ఎవరనేది ప్రీమియర్ల ద్వారా తేలిపోయింది.

ఓవర్సీస్ కింగ్‌గా పేరుతెచ్చుకున్న మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా అటు అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది.యూఎస్ బాక్సాఫీస్ వద్ద సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీమియర్ల ద్వారా $758,000 డాలర్లు వసూళ్లు సాధించగా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లో కలిపి ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా A$257,000 డాలర్లు వసూలు చేసింది.

అయితే ఒక్కరోజు తేడాతో రిలీజ్ అయిన అల వైకుంఠపురము సినిమాకు అన్ని చోట్ల బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా ప్రీమియర్లతో సరిలేరు నీకెవ్వరు సినిమాను దాటేసింది.యూఎస్‌లో ఈ సినిమా ఏకంగా $800,000 డాలర్లు వసూలు చేయగా, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లో $298,000 వసూళ్లు సాధించింది.

దీంతో సరిలేరు నీకెవ్వరు సినిమా రికార్డులకు బన్నీ బ్యాండ్ వేశాడంటూ, సంక్రాంతి అసలైన విన్నర్ బన్నీయే అంటూ సినీ జనం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఈ వీకెండ్ ముగిసే సరికి రెండు సినిమాల్లో ఏది ముందంజలో ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు

Ala Vaikuntapuramulo Surpasses Sarileru Neekevvaru Priemere Record In Overseas-overseas,priemere Show,sarileru Neekevvaru Related....