సినిమా రైటే.. రిలీజ్ మాత్రం రాంగ్ అంటోన్న ప్రేక్షకులు  

Ala Vaikuntapuramulo Released In Wrong Time - Telugu Ala Vaikuntapuramulo, Allu Arjun, Telugu Movie Gossips, Telugu Movie News, Trivikram

అన్ని బాగున్న ఒక్క సినిమాను చూసేందుకే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించని రోజులివి.అలాంటిది ఒకేసారి నాలుగైదు సినిమాలు బరిలోకి దిగితే ప్రేక్షకులు ఏ సినిమాను చూడాలో అయోమయంలో పడతారు.

Ala Vaikuntapuramulo Released In Wrong Time - Telugu Ala Vaikuntapuramulo, Allu Arjun, Telugu Movie Gossips, Telugu Movie News, Trivikram-Gossips-Telugu Tollywood Photo Image

ముఖ్యంగా మధ్య తరగతివారైతే తీరిగ్గా టీవీలోనో, ఆన్‌లైన్‌లోనే చూసేద్దాంలే అనుకుంటారు.కానీ అన్ని అంశాలు పక్కాగా ఉన్న సినిమాలు అరుదుగా వస్తాయి.

అలాంటిదే అల వైకుంఠపురములో సినిమా.

ఈ సినిమాలో అన్ని అంశాలను దర్శకుడు త్రివిక్రమ్ పక్కాగా ప్లా్న్ చేసుకుని ఓ పూర్తి ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు.

సినిమా రిలీజ్‌కు ముందే మంచి అంచనాలు క్రియేట్ చేసింది.కానీ ఈ సినిమాను రిలీజ్ చేసే విషయంలో మాత్రం త్రివిక్రమ్ లెక్క తప్పిందని అంటున్నారు కొంతమంది నిపుణులు.

సంక్రాంతి బరిలో ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న రిలీజ్ అయ్యి శని,ఆదివారాల కలెక్షన్లు కొల్లగొట్టింది.

అయితే అల వైకుంఠపురము సినిమాను గురువారం లేక శుక్రవారం కాకుండా ఏకంగా ఆదివారం రిలీజ్ చేయడంతో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల రికార్డును మిస్ చేసుకుంది.

ఇక ఈ సినిమాను ఇంత హడావిడిగా పండగ సీజన్‌లోనే రిలీజ్ ఎందుకు చేశారనేది చిత్ర వర్గాల ప్రశ్న.ఈ సినిమా ఇంకాస్త ముందు రిలీజ్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా అదిరిపోయే కలెక్షన్లు ఈ సినిమా సొంతం అయ్యి ఉండేదని చిత్ర వర్గాలు అంటున్నాయి.

తాజా వార్తలు

Ala Vaikuntapuramulo Released In Wrong Time-allu Arjun,telugu Movie Gossips,telugu Movie News,trivikram Related....