అల వైకుంఠపురములో ప్రపంచవ్యాప్త ప్రీరిలీజ్ బిజినెస్.. బన్నీ కెరీర్‌లోనే హయ్యెస్ట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో అన్ని పనులు ముగించుకుని సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో బన్నీ మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు ఎసరు పెట్టడం ఖాయమని ఆయన ఫ్యాన్స్‌తో పాటు చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు.

 Ala Vaikuntapuramulo Pre Release Worldwide Business Details-TeluguStop.com

అయితే సంక్రాంతి బరిలో బన్నీతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా ఉండటంతో ఈ సినిమా ఎలా తట్టుకోగలదో అనే సందేహం అందరిలోనూ ఉంది.కానీ ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ చూస్తే ఈ సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ ఏర్పడిందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

త్రివిక్రమ్, బన్నీల కాంబో కావడంతో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు బయ్యర్లు ఈ సినిమా హక్కులను అదిరిపోయే రేటుకు సొంతం చేసుకున్నారు.ఈ సినిమా ప్రపంచ్యవాప్తంగా రూ.84.46 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.ఈ రేంజ్‌లో ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం బన్నీ కెరీర్‌లోనే మొదటిసారి అని ఈ సినిమా లెక్కలు చూస్తే చెప్పొచ్చు.పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు.ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రీరిలీజ్ బిజినెస్ విరవాలు ఈ విధంగా ఉన్నాయి

నైజాం – 20.00 కోట్లు

సీడెడ్ – 12.06 కోట్లు

నెల్లూరు – 2.80 కోట్లు

కృష్ణా – 5.00 కోట్లు

గుంటూరు – 6.30 కోట్లు

వైజాగ్ – 8.50 కోట్లు

ఈస్ట్ – 6.30 కోట్లు

వెస్ట్ – 5.00 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 65.96 కోట్లు

కర్ణాటక – 7.20 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 1.50 కోట్లు

ఓవర్సీస్ – 9.80 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ – 84.46 కోట్లు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube