అల వైకుంఠపురములో ఫస్ట్ వీక్ కలెక్షన్లు.. రికార్డులకే రికార్డు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో బన్నీ బాక్సాఫీస్‌ను దడదడలాడిస్తున్నాడు.

 Ala Vaikuntapuramulo First Week Collections-TeluguStop.com

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుండటంతో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

త్రివిక్రమ్ మార్క్ కథనంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుండటంతో అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

బన్నీ స్టైలిష్ యాక్టింగ్‌కు జనాలు నీరాజనాలు పడుతున్నారు.అటు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం పోటీలో ఉన్నప్పటికీ ఆ సినిమాను ఓవర్‌టేక్ చేసి మరీ ఈ సినిమా కలెక్షన్లు రాబడుతోంది.

పూజా హెగ్డే అందాలు, థమన్ అందించిన సంగీతం కలగలిసి ఈ సినిమాను సంక్రాంతి విన్నర్‌గా నిలిపాయి.ఈ సినిమా మొదటి వారం పూర్తి చేసుకునే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.86.24 కోట్ల మేర వసూళ్లు సాధించింది.కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.108.08 కోట్లు కొల్లగొట్టింది.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 28.19 కోట్లు

సీడెడ్ – 13.42 కోట్లు

నెల్లూరు – 3.22 కోట్లు

కృష్ణా – 6.48 కోట్లు

గుంటూరు – 8.18 కోట్లు

వైజాగ్ – 13.45 కోట్లు

ఈస్ట్ – 7.09 కోట్లు

వెస్ట్ – 6.21 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.86.24 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 8.89 కోట్లు

ఓవర్సీస్ – 12.95 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ – రూ.108.08 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube