ఆ క్లబ్‌లో చేరిన బన్నీ.. కెరీర్‌లోనే ఫస్ట్ టైం  

Ala Vaikuntapuramulo Enters 2 Million Dollar Club-allu Arjun,collections,telugu Movie News,trivikram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సె్స్ అయ్యింది.

Ala Vaikuntapuramulo Enters 2 Million Dollar Club-Allu Arjun Collections Telugu Movie News Trivikram

ఇక ఓవర్సీస్‌లో పెద్దగా సక్సెస్ కాని బన్నీ ఈ సినిమాతో కెరీర్‌ బెస్ట్ రికార్డును అందుకున్నాడు.

ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

త్రివిక్రమ్ మార్క్ సినిమా నుండి వారు ఏ అంశాలు ఆశిస్తారో అవి ఈ సినిమాలో పుష్కలంగా ఉండటంతో వారు ఈ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు.ఇక యూఎస్‌లో ఈ సినిమా తాజాగా 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరింది.

ఈ సినిమాతో త్రివిక్రమ్ నాలుగోసారి ఈ క్లబ్‌లోకి చేరగా, అల్లు అర్జున్ తొలిసారి ఈ ఫీట్ అందుకున్నాడు.

మొత్తానికి అల వైకుంఠపురములో సినిమాతో బన్నీ-త్రివిక్రమ్‌లు బాక్సాఫీస్‌తో చెడుగుడు ఆడుతున్నారు.అటు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండటంతో తెలుగు సినిమా హవా యూఎస్ బాక్సాఫీస్ వద్ద కనిపిస్తుంది.మరి అల వైకుంఠపురములో సినిమా ఇంకా ఎలాంటి ఫీట్ అందుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు

Ala Vaikuntapuramulo Enters 2 Million Dollar Club-allu Arjun,collections,telugu Movie News,trivikram Related....