బాహుబలి భరతం పట్టిన అల వైకుంఠపురములో  

Ala Vaikuntapuramulo Breaks Baahubali 2 Record In Newzealand-allu Arjun,baahubali2,newzealand,prabhas,trivikram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అన్ని చోట్లా బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌కు జనాలు ఫిదా అవుతున్నారు.

Ala Vaikuntapuramulo Breaks Baahubali 2 Record In Newzealand-allu Arjun,baahubali2,newzealand,prabhas,trivikram Telugu Tollywood Movie Cinema Film Latest News-Ala Vaikuntapuramulo Breaks Baahubali 2 Record In Newzealand-Allu Arjun Baahubali2 Newzealand Prabhas Trivikram

ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌కు జనాలు ఇంప్రెస్ కావడంతో పాటు, ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు.

ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా ఏకంగా బాహుబలి రికార్డులను బద్దలుకొట్టి అందరికీ షాకిచ్చింది.

బాహుబలి ఓపెనింగ్ రోజున కొల్లగొట్టిన కలెక్షన్లను అల వైకుంఠపురములో క్రాస్ చేసి దిమ్మతిరిగే షాకిచ్చింది.ఇంతకీ ఇదెక్కడ జరిగిందని అనుకుంటున్నారా? ఓవర్సీస్‌లోని న్యూజిలాండ్‌లో అల వైకుంఠపురములో సినిమా మూడు ప్రాంతాల్లో ఐదు షోలకు కలిపి 34625 డాలర్లు వసూలు చేసింది.కాగా గతంలో బాహుబలి ఈ ప్రాంతంలో 21290 డాలర్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.

బాహుబలి క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టడం ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు సాధ్యం కాలేదు.

కానీ అల వైకుంఠపురములో సినిమా మాత్రం అలవోకగా ఈ రికార్డును బద్దలుకొట్టింది.దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ సినిమా మున్ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు

Ala Vaikuntapuramulo Breaks Baahubali 2 Record In Newzealand Related....