‘అల వైకుంఠపురములో’తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బన్నీ  

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

TeluguStop.com - Ala Vaikuntapuramulo Becomes Allu Arjun Career Biggest Hit

త్రివిక్రమ్ కంటెంట్‌కు ఆడియెన్స్ కనెక్ట్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

ఈ సినిమా ఏ,బీ,సీ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్‌లోనూ హౌజ్‌ఫుల్ బోర్డులతో దూసుకుపోతుంది.

అల్లు అర్జున్ యాక్టింగ్, త్రివిక్రమ్ టేకింగ్‌, థమన్ మ్యూజిక్‌కు జనాలు ఫిదా అవుతున్నారు.ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా శుక్రవారం మధ్యాహ్నం వరకు రూ.70 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిందని తెలుస్తోంది.కొన్ని ఏరియాల్లో ఈ సినిమా అప్పుడే బ్రేక్ ఈవెన్‌కు కూడా చేరుకుంది.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో బన్నీ తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు.ఈ సినిమాను అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

ఈ సినిమా విజయోత్సవ వేడుకలు ఈ నెల 19న వైజాగ్‌లో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.

#Pooja Hegde #Trivikram #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు