అల వైకుంఠపురములో 5 రోజుల షేర్ కలెక్షన్లు.. ఎంతంటే?  

Ala Vaikuntapuramulo 5 Days Collections-allu Arjun,collections,pooja Hegde,trivikram

టాలీవుడ్‌లో ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన రెండు పెద్ద సినిమాలు హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద తమ ప్రతాపం చూపిస్తున్నాయి.ఈ పండగకు ‘‘నేనంటే నేను’’ సంక్రాంతి మొగుడిని అంటూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి.

Ala Vaikuntapuramulo 5 Days Collections-allu Arjun,collections,pooja Hegde,trivikram Telugu Tollywood Movie Cinema Film Latest News Ala Vaikuntapuramulo 5 Days Collections-allu Arjun Collections Pooja-Ala Vaikuntapuramulo 5 Days Collections-Allu Arjun Collections Pooja Hegde Trivikram

ఈ సినిమాల్లో మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11న రిలీజ్ అయ్యి పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దూసుకుపోతుంది.

కాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురముల సినిమా జనవరి 12న రిలీజ్ అయ్యి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తన సత్తా చాటింది.ఈ సినిమా 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా రూ.70.72 కోట్లు వసూళ్లు సాధించింది.బన్నీ యాక్టింగ్, త్రివిక్రమ్ టేకింగ్‌కు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.

ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌‌లో కూడా దుమ్ములేపుతోంది.ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర కలెక్షన్లు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 22.53 కోట్లు

సీడెడ్ – 11.02 కోట్లు

నెల్లూరు – 2.62 కోట్లు

కృష్ణా – 6.66 కోట్లు

గుంటూరు – 6.76 కోట్లు

వైజాగ్ – 9.45 కోట్లు

ఈస్ట్ – 6.59 కోట్లు

వెస్ట్ – 5.09 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.70.72 కోట్లు

తాజా వార్తలు