అల వైకుంఠపురములో 36 రోజుల కలెక్షన్లు.. తగ్గని జోరు!  

Ala Vaikuntapuramulo 36 Days Worldwide Collections - Telugu Ala Vaikuntapuramulo, Allu Arjun, Collections, Pooja Hegde, Thaman, Trivikram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ మూవీగా నిలిచింది.మాటల మాంత్రికుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై మొదట్నుండీ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Ala Vaikuntapuramulo 36 Days Worldwide Collections - Telugu Ala Vaikuntapuramulo, Allu Arjun, Collections, Pooja Hegde, Thaman, Trivikram-Movie-Telugu Tollywood Photo Image

పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు జనం ఆసక్తి చూపించారు.

కాగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించింది.

ఆకట్టుకునే కథతో పాటు అదిరిపోయే మ్యూజిక్ ఈ సినిమాకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.దీంతో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.తక్కువ సమయంలో రూ.100 కోట్ల వసూళ్లు సాధించడమే కాకుండా బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది.ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 36 రోజులు ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా రూ.159.46 కోట్ల వసూళ్లు సాధించింది.

బన్నీ స్టైలిష్ యాక్టింగ్, త్రివిక్రమ్ మార్క్ టేకింగ్, థమన్ అద్భుతమైన సంగీతం ఈ సినిమాను సూపర్‌ సక్సెస్‌ చేయడంలో తోడ్పడ్డాయి.

ఇక ఈ సినిమా ఏరియాల వారీగా 36 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 44.55 కోట్లు

సీడెడ్ – 18.19 కోట్లు

గుంటూరు – 11.11 కోట్లు

ఉత్తరాంధ్ర – 19.77 కోట్లు

ఈస్ట్ – 11.37 కోట్లు

వెస్ట్ – 8.89 కోట్లు

కృష్ణా – 10.73 కోట్లు

నెల్లూరు – 4.69 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 129.30 కోట్లు

కర్ణాటక – 9.21 కోట్లు

కేరళ – 1.17 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 1.44 కోట్లు

ఓవర్సీస్ – 18.34 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ – 159.46 కోట్లు

తాజా వార్తలు

Ala Vaikuntapuramulo 36 Days Worldwide Collections-allu Arjun,collections,pooja Hegde,thaman,trivikram Related....