అల వైకుంఠపురములో 31 రోజుల కలెక్షన్లు.. ఎంతో తెలుసా?  

Ala Vaikuntapuramulo 31 Days Collections-allu Arjun,pooja Hegde,telugu Movie News,trivikram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు థియేటర్లకు ఎగబడ్డారు.

Ala Vaikuntapuramulo 31 Days Collections-Allu Arjun Pooja Hegde Telugu Movie News Trivikram

పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా అల వైకుంఠపురములో రావడంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో విన్నర్‌గా నిలిచింది.

ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా పలు కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

అటు నాన్-బాహుబలి రికార్డులను క్రియేట్ చేస్తూనే ఇండస్ట్రీ హిట్‌గా ఈ సినిమా నిలిచింది.బన్నీ యాక్టింగ్‌కు త్రివిక్రమ్ టేకింగ్ తోడవ్వడంతో ఈ సినిమాను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూశారు.ఇప్పటికే రిలీజ్ అయ్యి 31 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.158.64 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ దుమ్ము దులిపింది.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు థమన్ అదిరిపోయే సంగీతం బాగా హెల్ప్ అయ్యింది.

ఈ ఏడాదిలో తొలి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ మూవీగా అల వైకుంఠపురములో నిలవడంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 31 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 44.23 కోట్లు

సీడెడ్ – 18.11 కోట్లు

గుంటూరు – 11.03 కోట్లు

ఉత్తరాంధ్ర – 19.69 కోట్లు

ఈస్ట్ – 11.30 కోట్లు

వెస్ట్ – 8.85 కోట్లు

కృష్ణా – 10.66 కోట్లు

నెల్లూరు – 4.66 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 128.53 కోట్లు

కర్ణాటక – 9.18 కోట్లు

కేరళ – 1.17 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 1.44 కోట్లు

ఓవర్సీస్ – 18.32 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు – 158.64 కోట్లు

.

తాజా వార్తలు

Ala Vaikuntapuramulo 31 Days Collections-allu Arjun,pooja Hegde,telugu Movie News,trivikram Related....