అల వైకుంఠపురములో 12 రోజలు వరల్డ్‌వైడ్ కలెక్షన్లు.. సాలిడ్ హిట్  

Ala Vaikuntapuramulo 12 Days Worldwide Collections-allu Arjun,collections,trivikram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

Ala Vaikuntapuramulo 12 Days Worldwide Collections-Allu Arjun Collections Trivikram

ఈ సినిమా రిలీజ్ అయ్యి 12 రోజులు ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.107.78 కోట్ల మేర షేర్ వసూళ్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.135.20 కోట్ల షేర్ సాధించింది.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడమే కాకుండా మళ్లీ మళ్లీ చూసేలా చేయడంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో అసలైన విజేతగా నిలిచింది.

త్రివిక్రమ్ మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా అన్ని ఏరియాల్లో తన సత్తా చాటుతూ దూసుకుపోతోంది.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అదనపు బలాన్ని చేకూర్చింది.

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 12 రోజుల వరల్డ్‌వైడ్ షేర్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 35.08 కోట్లు

సీడెడ్ – 16.02 కోట్లు

గుంటూరు – 9.78 కోట్లు

వైజాగ్ – 16.34 కోట్లు

ఈస్ట్ – 9.65 కోట్లు

వెస్ట్ – 7.52 కోట్లు

నెల్లూరు – 3.93 కోట్లు

కృష్ణా – 9.46 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 107.78 కోట్లు

కర్ణాటక – 8.27 కోట్లు

కేరళ – 1.15 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 1.34 కోట్లు

ఓవర్సీస్ – 16.66 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ – 135.2 కోట్లు

తాజా వార్తలు

Ala Vaikuntapuramulo 12 Days Worldwide Collections-allu Arjun,collections,trivikram Related....