ఓవర్సీస్ లో దుమ్ము లేపిన బన్నీ! అఆ సినిమా రికార్డ్స్ బ్రేక్

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని రికార్డ్ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తుంది.ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసే దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమా వసూళ్ళ వేట కొనసాగిస్తుంది.

 Ala Vaikuntapuramlo Us Collections Create Records-TeluguStop.com

మహేష్ బాబు సరిలేరు, బన్నీ అల సినిమాలు రెండు కలెక్షన్స్ పరంగా పోటీ పడుతున్నాయి.ఇదిలా ఉంటే బన్నీ కలెక్షన్స్ వేట యూఎస్ లో కూడా కొనసాగుతుంది.

అక్కడి ప్రేక్షకులను అల వైకుంఠపురం మెస్మరైజ్ చేస్తుంది.విడుదలై వారం రోజులు పూర్తయిన అక్కడ వసూళ్లు మాత్రం తగ్గలేదు.

తాజాగా సమాచారం ప్రకారం అల అలవైకుంఠపురంలో యూఎ లోస్ $2.48 మిలియన్ వసూళ్లు సాధించింది.బన్నీకి ఫస్ట్ $2 మిలియన్ వసూళ్ల చిత్రంగా యూఎస్ లో అల రికార్డులకెక్కింది.యూఎస్ లో త్రివిక్రమ్ నితిన్ కాంబినేషన్ లో వచ్చిన అఆ అత్యధిక వసూళ్లు సాధించగా దానిని ఈ సినిమా వారం రోజుల్లోనే బ్రేక్ చేసింది.

ఇప్పటికే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సినిమా పోజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకొని దూసుకెళ్తుంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా కావడంతో పాటు కామెడీ ఎక్కువగా పేలడంతో సినిమా సక్సెస్ అందుకుంది.

మరి లాంగ్ రన్ లో సినిమా ఓవర్సీలో ఎంత కలెక్షన్ రాబడుతుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube