బన్నీ సినిమా నిజంగా సెంచరీ కొట్టి ఆ రికార్డు దక్కించుకుందా?

అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను అల వైకుంఠపురంలో చిత్రంతో దక్కించుకున్నాడు.నాన్‌ బాహుబలి రికార్డును దక్కించుకున్న బన్నీ తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు అంటూ యూనిట్‌ సభ్యులు గొప్పగా చెబుతున్నారు.

 Ala Vaikuntapuramlo Movie Complete 107 Theaters In 50 Days-TeluguStop.com

గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలు 50 రోజులు ఆడటం చాలా గొప్ప విషయం అయ్యింది.రెండు మూడు రోజులు ఆడిన తర్వాత ఎంత మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలు అయినా కూడా కనిపించకుండా పోతున్నాయి.

Telugu Alluarjun-Movie

అల వైకుంఠపురంలో చిత్రం మాత్రం 50 రోజులు పూర్తి అయినా కూడా ఇంకా థియేటర్లలోనే ఉంది.ఒకటి కాదు రెండు కాదు సెంచరీ క్రాస్‌ చేసి ఏకంగా 107 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.వంద థియేటర్లకు మించి 50 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బన్నీ సినిమా మరో బంపర్‌ రికార్డు కొట్టింది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా గొప్పగా చెబుతున్నారు.

Telugu Alluarjun-Movie

థియేటర్ల పేర్లతో ప్రకటించిన నేపథ్యంలో జిమ్ముకు ఏమైనా చేసి ఉండవచ్చు ఏమో కాని ఖచ్చితంగా బన్నీ రికార్డును సొంతం చేసుకుని ఉంటాడు అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.డబ్బులు ఇచ్చి థియేటర్లలో సినిమాను ఉంచారా లేదంటే మరోరకంగా ఉంచారా అనేది తెలియదు.అయితే పెద్ద సినిమాలు ఏవీ కూడా రాకపోవడం వల్ల కూడా ఇన్ని థియేటర్లలో సినిమా 50 రోజులు పూర్తి చేసుకుని ఉండవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube