త్రివిక్రమ్ నా కథ దొంగిలించాడు అంటున్న యువ దర్శకుడు  

Ala Vaikuntapuramlo Face Copy Rights Issue - Telugu Ala Vaikuntapuramlo, Allu Arjun, Face Copy Rights Issue, Tollywood, Trivikram Srinivas

టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత గొప్ప దర్శకుడు అయిన కూడా అతని మీద ఒక నెగిటివ్ కామెంట్ వినిపిస్తూ ఉంటుంది.పాత కథలని తీసుకొని దానికి కొత్త రంగు పూసి జనం మీదకి వదులుతాడు.

Ala Vaikuntapuramlo Face Copy Rights Issue - Telugu Ala Vaikuntapuramlo, Allu Arjun, Face Copy Rights Issue, Tollywood, Trivikram Srinivas-Movie-Telugu Tollywood Photo Image

అలాగే ఎలాంటి హక్కులు తీసుకోకుండా ఇతర సినిమాలని సునాయాసంగా కాపీ చేసేస్తూ ఉంటారు.ఈ ఆరోపణలు అతడు సినిమా నుంచి త్రివిక్రమ్ మీద వినిపిస్తూ ఉంటాయి.

ఇక అజ్నాతవాసి సినిమాని ఓ హాలీవుడ్ మూవీ కాపీ చేసి తీసారని ఆ సినిమా దర్శకుడు నేరుగా రియాక్ట్ అయ్యి కేసు వేశారు.తరువాత దానిని సెటిల్ చేసుకున్నట్లు టాక్ వినిపించింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమా విషయంలో కూడా కృష్ణ అనే యువ దర్శకుడు త్రివిక్రమ్ కి లీగల్ నోటీసులు పంపిస్తానని అన్నారు.2005లో త్రివిక్ర‌మ్‌ని క‌లిసిన అల వైకుంఠ పురములో కథను చెప్పానని, దానినే 2013లో ఫిలిం ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ కూడా చేసుకున్నానని కృష్ణ తెలిపారు.ఈ నేపథ్యంలో త‌న స్క్రిప్ట్ ఫ‌స్ట్ పేజ్ కాపీని తాను దర్శకుడు త్రివిక్ర‌మ్‌కి ఇచ్చాన‌ని కృష్ణ అంటున్నాడు.త‌న క‌థ‌తో అల వైకుంఠ‌పుర‌ములో సినిమా తీశారని ఆయన ఆరోపణలు చేస్తున్నారు.

దీనిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని కృష్ణ తెలిపారు.

తాజా వార్తలు

Ala Vaikuntapuramlo Face Copy Rights Issue-allu Arjun,face Copy Rights Issue,tollywood,trivikram Srinivas Related....