మహేష్‌ తెలివి తక్కువతనమా ఇదేంటో అర్థం కావడం లేదు  

Ala Vaikuntapuramlo Movie Effect On Sarileru Neekevvaru Collections-january 12th Release,mahesh Babu,sankrathi 2020,sarileru Neekevvaru Collections

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన 25వ చిత్రం మహర్షితో కమర్షియల్‌గా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే.రికార్డు స్థాయిలో ఆ చిత్రం వసూళ్లు నమోదు చేసింది.ఆ చిత్రం తర్వాత ప్రస్తుతం మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు అనే చిత్రాన్ని అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు.సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తప్పకుండా రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు.

Ala Vaikuntapuramlo Movie Effect On Sarileru Neekevvaru Collections-january 12th Release,mahesh Babu,sankrathi 2020,sarileru Neekevvaru Collections-Ala Vaikuntapuramlo Movie Effect On Sarileru Neekevvaru Collections-January 12th Release Mahesh Babu Sankrathi 2020 Collections

సంక్రాంతికి ఈ చిత్రంను విడుదల చేయబోతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.అయితే అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో చిత్రం విడుదల కాబోతున్న జనవరి 12నే సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.రెండు పెద్ద సినిమాలు కనీసం వారం రోజుల గ్యాప్‌తో అయినా విడుదల అవ్వాలనేది సినిమా పెద్దల ఒప్పందం.పండగ సమయాల్లో రెండు మూడు రోజుల గ్యాప్‌లో వస్తే పర్వాలేదు.కాని అల్లు అర్జున్‌ వస్తున్న రోజే మహేష్‌బాబు రాబోతున్నాడు.

Ala Vaikuntapuramlo Movie Effect On Sarileru Neekevvaru Collections-january 12th Release,mahesh Babu,sankrathi 2020,sarileru Neekevvaru Collections-Ala Vaikuntapuramlo Movie Effect On Sarileru Neekevvaru Collections-January 12th Release Mahesh Babu Sankrathi 2020 Collections

 అల వైకుంఠపురంలో సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం చేస్తున్న కారణంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆయన తెరకెక్కిస్తున్నాడు.అలాంటి సినిమాతో పోటీ పడటం వల్ల ఖచ్చితంగా కలెక్షన్స్‌ ప్రభావం ఉంటుంది.సినిమా హిట్‌అయినా ఫ్లాప్‌ అయినా కూడా కలెక్షన్స్‌ ప్రభావం ఉంటుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

కాని మహేష్‌బాబు మాత్రం జనవరి 12నే సినిమాను విడుదల చేయాలంటూ నిర్మాతలకు గట్టిగా సూచిస్తున్నాడట.మహేష్‌ ఇలా చేయడంను తెలివితక్కువ తనమా అంటున్నారు.