అల వైకుంఠపురంలో సామజవరగమన సాంగ్ మరో రికార్డ్  

Ala Vaikuntapuram Lo Create Another Record-allu Arjun,create Records,director Trivikram Srinivas

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురంలో.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఆమధ్య సామజవరగమన అనే సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ పాటకి తమన్ స్వరాలు సమకూర్చారు.ప్రస్తుతం సౌత్ లో స్టార్ సింగర్ గా దూసుకుపోతున్న సిద్ధ్ శ్రీరామ్ ఈ పాట ఆలపించాడు.

Ala Vaikuntapuram Lo Create Another Record-allu Arjun,create Records,director Trivikram Srinivas Telugu Tollywood Movie Cinema Film Latest News-Ala Vaikuntapuram Lo Song Create Another Record-Allu Arjun Create Records Director Trivikram Srinivas

ఇక రిలీజ్ అయిన కొద్దిరోజుల్లోనే ఈ పాటకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.దీంతో యూట్యూబ్ లో ఈ సాంగ్ ఒక్కసారిగా టాప్ లో దూసుకుపోయింది.ఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన బెస్ట్ మెలోడీగా ప్రేక్షకుల నుంచి కూడా ఈ సాంగ్ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది.

సౌత్ ఇండియాలో అతి తక్కువ టైంలో ఒక పాటకి ఏకంగా 100 మిలియన్ వ్యూస్ రావడం ఇదే మొదటిసారి.సౌత్ ఇండియాలో ఇప్పటివరకు సాయి పల్లవి నటించిన మారి సినిమాలో సాంగ్ తో పాటు, ఫిదా సినిమాలో సాంగ్ కి యూట్యూబ్ లో100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.అయితే అతి తక్కువ టైమ్ లో 100 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసిన సాంగ్ గా సామజవరగమన సాంగ్ రికార్డ్ సొంతం చేసుకుంది.దీంతో రిలీజ్కి ముందే సోషల్ మీడియాలో అల వైకుంఠపురంలో సినిమా ట్రెండింగ్ దూసుకుపోతుంది.ఇక అత్యధిక సంఖ్యలో టిక్ టాక్ వీడియోస్ చేసిన సాంగ్ కూడా ఇది రికార్డు క్రియేట్ చేయడం విశేషం.మరి ఫ్యామిలీ డ్రామా గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో అనేది ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది