త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది, బన్నీ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమా వంద కోట్ల షేర్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.ఇక ఈ సినిమా హిట్ తో మంచి జోష్ మీద ఉన్న టీం సక్సెస్ మీట్ కి ప్లాన్ చేస్తుంది.
రిలీజ్ కి ముందు హైదరాబాద్ లో మ్యూజికల్ నైట్ పెట్టిన టీం ఈ సారి విశాఖలో సాగరతీరంలో సక్సెస్ మీట్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఏపీలో ఫిలిం హబ్ గా మారుతున్న విశాఖలో ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్స్ రెగ్యులర్ గా జరుగుతున్నాయి.
ఈ నేపధ్యంలో అల వైకుంఠపురం సినిమా సక్సెస్ మీట్ కూడా అక్కడే పెట్టి విశాఖ సినిమాకి అదనపు బూస్టింగ్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ ని జనవరి 19న చాలా గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.