భర్త ఇచ్చిన ప్రియమైన జుంకాలు ధరించిన ట్వింకిల్ ఖన్నా

బాలీవుడ్లో సోషల్ మీడియాలో ఎప్పుడూ కాస్త సరదా జోడించి పోస్ట్ లు పెట్టడంలో యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, అతని భార్య ట్వింకిల్ ఖన్నా ఎప్పుడు ముందు ఉంటారు.సమకాలీన రాజకీయాల మీద కూడా వ్యంగ్యంగా పోస్టులు పెడుతూ తమ సెన్సాఫ్ హ్యూమర్ చూపిస్తూ ఉంటారు.

 Akshay Kumar Twinkle Khanna Wearing Onion Earrings-TeluguStop.com

కొద్ది రోజుల క్రితం అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నా కి ఉల్లిపాయల జుంకాలు గివ్ట్ గా ఇచ్చాడు.తన భార్యకి తాను ఇచ్చే అత్యంత ఖరీదైన బహుమతి ఇదే అని సరదాగా కామెంట్స్ పోస్ట్ చేశాడు.

దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో అక్షయ్ కుమార్ ఈ విధంగా తనదైన శైలిలో స్పందించారు.

అయితే ఉల్లి ధరలలో ఇప్పటికీ కూడా ఎలాంటి మార్పు లేకపోగా మరింతగా పెరుగుతూ వస్తున్నాయి.

కొన్ని చోట్ల వీటి ధరలు 200 నుంచి 250 వరకు ఉన్నాయనే మాట వినిపిస్తుంది.ఇక ఏపీలో కూడా 150 రూపాయిలకి బయట మార్కెట్ లో అమ్ముతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా తన భర్త తనకి ఇచ్చిన ప్రియమైన జుంకాలు ధరించి ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసి కాస్తా ఫన్నీగా పోస్ట్ చేసింది.ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవడంతో పాటు ఆసక్తికరమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube