అసోం విపత్తుపై ఆదుకోవడానికి ముందుకొచ్చిన స్టార్ హీరో  

Akshay Kumar To Donate Rs 2 Crore For Assam Flood Victims-

ప్రకృతి విపత్తుల సమయంలో మన స్టార్ హీరోలు ప్రతి సారి వారి పెద్ద మనసు చాటుకుంటారు.విపత్తుల సమయంలో నిరాశ్రయులైన వారికి సాయం అందించడానికి ముందుకొస్తారు.చాలా సందర్భాలలో ఇది జరిగింది..

Akshay Kumar To Donate Rs 2 Crore For Assam Flood Victims--Akshay Kumar To Donate Rs 2 Crore For Assam Flood Victims-

బాలీవుడ్ లో అందరికంటే స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇలాంటి సమయాలలో కాస్తా ముందు వరుసలో ఉంటాడు.కష్టపడిన రూపాయిలో ఒక్క పైసా కూడా అనవసరం ఉపయోగించడు.కాని ఎవరైనా కష్టంలో ఉంటే మాత్రం వెంటనే కోట్ల రూపాయిలు సాయం చేసేస్తాడు.

దీనికి ఎంత మాత్రం ఆలోచించడు.అందుకే బాలీవుడ్ అక్షయ్ కుమార్ అంటే చాలా మంది అభిమానిస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే ఈశాన్య రాష్ట్రం అయిన అసోంని ప్రస్తుతం భారీ వర్షాలు, వరదలు ముంచేస్తున్నాయి.

వీటి కారణంగా లక్షల మంది ప్రజలు ఇప్పటికే నిరాశ్రయులు అయిపోయారు.పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.కుండపోత వర్షాలతో బ్రహ్మపుత్ర, సుబాన్‌సిరి, ధన్‌సిరి, జియాభరలి, కొపిలి, ధరామ్‌తుల్‌, పుతీమరి, బేకి, బరాక్‌, బాదర్‌పూర్‌ నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉండటంతో 30 జిల్లాలు వరదల గుప్పిట్లో చిక్కుకున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల మందికిపైగా నిరాశ్రయులవగా, 4 వేలకుపైగా గ్రామాలు నీటమునిగినట్లు అధికారులు చెబుతున్నారు.ఈ విపత్తుకి కదిలిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తనవంతు సాయం అందించాడు.

2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నాడు.వరదల్లో దెబ్బతిన్న ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్కు కోసం కోటి, అసోం సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి చొప్పున విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు.