కరోనా సమయంలో రిస్క్ చేస్తున్న స్టార్ హీరో

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ కారణంగా ప్రజలు తమ రోజూవారి పనులకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు.

 Akshay Kumar Taking Risk,  Akshay Kumar, Corona Virus, Bell Bottom, Bollywood Ne-TeluguStop.com

కానీ ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ మాత్రం కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ లెక్క చేయకుండా సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు రెడీ అయ్యాడు.బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసిన అక్షయ్ కుమార్ తాజాగా బెల్ బాటమ్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

వాషు భగ్నాని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ అదిరిపోయే పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే షూటింగ్ మొదలు కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.

కానీ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కేందుకు రెడీ అయ్యింది.ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ తెలుపడం మరో విశేషం.

ఆగస్టు నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపాడు.
పూర్తి పీరియడ్ డ్రామాగా ఈ సినిమా రానుండటంతో బాలీవుడ్ జనాలు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ఇప్పట్లో షూటింగ్‌లు మొదలుకవానుకున్న తరుణంలో ఇలాంటి రిస్క్ తీసుకుంటుండటంతో అక్షయ్ కుమార్ ఆరోగ్యం జాగ్రత్త అని పలువురు కోరుతున్నారు.ఏదేమైనా యాక్షన్ చేయడానికి ఎంత రిస్క్ అయినా చేస్తాడు ఈ బాలీవుడ్ హీరో.

ఇక ఈ సినిమాలో హుమా ఖురేషి, వాణి కపూర్ మరియు లారా దత్తా కీలకమైనా పాత్రల్లో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube