ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ రీమేక్ చేయబోతున్న అక్షయ్ కుమార్  

ఎన్టీఆర్ కెరియర్ లో ఫ్లాప్ అయినా కూడా అందరికి బాగా నచ్చిన సినిమాగా ఊసరవెల్లి ఉంటుంది.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ బడ్జెట్ తో పాటు, భారీ అంచనాల మధ్య తెరకెక్కింది.

TeluguStop.com - Akshay Kumar Remake Jr Ntr Flop Movie

ఇందులో కాస్తా యాంటీ షేడ్స్ ఉన్న హీరోయిజం ఎన్టీఆర్ పాత్రలో కనిపిస్తుంది.అలాగే అద్భుతమైన కామెడీ కూడా ఉంటుంది.

అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్ లో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.అంచనాలని అందుకోలేక ఫ్లాప్ అయ్యింది.

TeluguStop.com - ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ రీమేక్ చేయబోతున్న అక్షయ్ కుమార్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ సినిమా కారణంగా నిర్మాత కూడా కొంత వరకు నష్టపోయాడు.అయితే ఊహించని విధంగా తొమ్మిదేళ్ల తర్వాత ఈ సినిమా ఇప్పుడు హిందీలోకి రీమేక్ కాబోతుంది.

దీనిని రీమేక్ చేయడానికి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సిద్ధమైంది.

బాలీవుడ్ లో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీసెంట్ గా కాంచన రీమేక్ గా తెరకెక్కిన లక్ష్మి సినిమాతో హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.ప్రస్తుతం కన్నడ హిట్ మూవీ బెల్ బాటమ్ సినిమాని అదే టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు.

దీంతో పాటు మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు అక్షయ్ కుమార్ హీరోగా ఊసరవెల్లి సినిమాని రీమేక్ చేయడానికి టిప్స్ నిర్మాణ సంస్థ ప్రయత్నం మొదలు పెట్టింది.

ఇప్పటికే రీమేక్ రైట్స్ కూడా ఈ సంస్థ కొనుగోలు చేసింది.భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కించే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.

#Jr NTR #Akshay Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు