మెగాస్టార్ హిట్ సినిమానే తిప్పి తిప్పి తీసారా.. అయినా బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వలే!

బాలీవుడ్ బడా హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు.ఈయన విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు.

 Akshay Kumar Raksha Bandan Movie,  Akshay Kumar, Bollywood, Raksha Bandhan, Hitt-TeluguStop.com

ఈయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు.జయాపజయాలతో సంభంధం లేకుండా వరస పెట్టి సినిమాలు చేస్తుంటాడు.

అయితే ఇదంతా ఒకప్పటి మాట.ఇప్పుడు ఈయన సినిమాలను కూడా అక్కడి ప్రేక్షకులు పట్టించు కోవడం లేదు.

తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రక్షా బంధన్ ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ ఈసారి కూడా బాలీవుడ్ పరిశ్రమకు నిరసనే ఎదురైంది.ఎప్పటి నుండో ప్లాప్స్ ఎదుర్కొంటున్న బాలీవుడ్ ను ఈ సినిమా కూడా నిరాశ పరిచింది.ఈ సినిమా అయితే కేవలం 8 కోట్లు మాత్రమే ఓపెనింగ్స్ రాబట్టి విమర్శల పాలు అవుతుంది.

అయితే ఈ సినిమా చూస్తుంటే మన టాలీవుడ్ లో మెగాస్టార్ నటించిన హిట్లర్ సినిమా గుర్తుకు వస్తుంది.ఈ సినిమాలో చిరంజీవి తన నలుగురు అక్కా చెల్లళ్ళను పెంచి పెద్దవాళ్ళను చేసే బాధ్యత తీసుకుంటాడు.

ఈ సినిమా మన టాలీవుడ్ లో చిరు కెరీర్ లో క్లాసిక్ హిట్ గా మిగిలి పోయింది.సిస్టర్ సెంటిమెంట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Telugu Akshay Kumar, Akshaykumar, Bollywood, Hittler, Raksha Bandhan-Movie

అయితే ఇదే సినిమాను ఇప్పుడు తిప్పి తిప్పి అక్షయ్ కుమార్ రక్షా బంధన్ గా తెరకెక్కించారు.కాని ఇక్కడ రిజల్ట్ వేరుగా వచ్చింది.సిస్టర్ సెంటిమెంట్ తోనే తెరకెక్కిన ఈ సినిమాను రాఖీ పౌర్ణమి రోజు రిలీజ్ చేసారు.కానీ ఈ సినిమా భారీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది.ఉత్తరాది ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేక పోయి నిరాశ పరిచింది.ఇదే సినిమాతో చిరు బ్లాక్ బస్టర్ హిట్ కొడితే.

అక్షయ్ కుమార్ మాత్రం భారీ ప్లాప్ అందుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube