సంపాదనలో దేశంలోనే టాప్ హీరో.. ఎవరో తెలుసా?  

Akshay Kumar Lists In Forbes Top Earning Star - Telugu Akshay Kumar, Bollywood News, Forbes, Top Earning Star

బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న స్టార్ హీరో అక్షయ్ కుమార్ అందరు హీరోలకంటే ఎక్కవ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ సందడి చేస్తుంటాడు.ఏడాదిలో రెండు మూడు సినిమాలను ఖచ్చితంగా రిలీజ్ చేసే ఈ హీరో సంపాదన కూడా అంతే ఎక్కువగా ఉంటుంది.

 Akshay Kumar Lists In Forbes Top Earning Star

తాజాగా వెలువరించిన ఫోర్బ్స్ జాబితా కూడా మనకు ఇదే చెబుతోంది.ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రెటీల జాబితాను 2020కి గాను ఫోర్బ్స్ తాజాగా రిలీజ్ చేసింది.

ఈ జాబితాలో భారత్ తరఫున అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీగా కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు.ఇటీవల కాలంలో అక్షయ్ కుమార్ నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్లు సాధించినవిగా నిలిచాయి.

సంపాదనలో దేశంలోనే టాప్ హీరో.. ఎవరో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image

అటు పలు కమర్షియల్ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ అక్షయ్ కోట్లలో రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడు.దీంతో 2020లో అక్షయ్ ఏకంగా 48.5 మిలియన్ డాలర్లు సంపాధించినట్లు ఫోర్బ్స్ జాబితా ప్రకటించింది.
కాగా ఫోర్బ్స్ జాబితాలో 52వ స్థానం దక్కించుకున్న అక్షయ్ వయసు ప్రస్తుతం 52.ఈ వయసులోనూ అదిరిపోయే సంపాదనతో మిగతా స్టార్ హీరోలకు చుక్కలు చూపిస్తున్నాడు ఈ యాక్షన్ కింగ్.ఇక ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న అక్షయ్ మరింత సంపాదనతో దూసుకెళ్లడం ఖాయమని ఆయన శ్రేయోభిలాషులు అంటున్నారు.

ఏదేమైనా అక్షయ్ సాధించిన ఈ అరుదైన ఫీట్‌కు పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test