ఓటీటీలో అంత రేటా.. నోరెళ్లబెడుతున్న దర్శకనిర్మాతలు!  

Akshay Kumar Laxmmi Bomb Gets Thundering OTT Offer, Akshay Kumar, Laxmmi Bomb, OTT Offer, Raghava Lawrence - Telugu Akshay Kumar, Laxmmi Bomb, Ott Offer, Raghava Lawrence

తమిళ డైరెక్టర్ రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమా ఎలాంటి రిజల్ట్‌ను సాధించిందో అందరికీ తెలిసిందే.హార్రర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తి సక్సెస్ కావడంతో అప్పట్లోనే ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది.

 Akshay Kumar Laxmmi Bomb Ott

కాగా ఈ సినిమాను ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు లారెన్స్.బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.అయితే ప్రస్తుతం పలు సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫాంలపై దర్శకనిర్మాతలు రిలీజ్ చేస్తుండటంతో, లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ మొగ్గు చూపుతుంది.ఈ క్రమంలోనే లక్ష్మీ బాంబ్ చిత్రానికి ఓ ఓటీటీ వారు ఏకంగా రూ.125 కోట్ల భారీ ఆఫర్‌ను అందించారట.అయితే ఈ మొత్తానికి సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలా వద్దా అనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారట.

ఓటీటీలో అంత రేటా.. నోరెళ్లబెడుతున్న దర్శకనిర్మాతలు-Gossips-Telugu Tollywood Photo Image

ఇక అక్షయ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తు్న్న ఈ సినిమాను కాంచన రీమేక్‌గా తెరకెక్కిస్తున్న లారెన్స్, కథ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.మరి లక్ష్మీ బాంబ్ చిత్రం ఓటీటీలో దర్శనమిస్తుందా లేదా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akshay Kumar Laxmmi Bomb Ott Related Telugu News,Photos/Pics,Images..