"లక్ష్మీ బాంబ్" బాలీవుడ్ లో పేలుతుందా...?

ఇటు తెలుగులో, అటు తమిళంలో ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన ఆ తర్వాత కొన్ని సినిమాలతో దర్శకుడిగా కూడా మారిపోయాడు రాఘవ లారెన్స్.మొట్టమొదటిగా అక్కినేని నాగార్జునతో కలిసి డాన్ సినిమాను తీసి హిట్ ను అందుకున్నాడు.

 Laxmi Bomb Trailer Release Talk, Raghava Lawrence, Laxmi Bomb,akshay Kumar, Kiar-TeluguStop.com

ఇక ఆ తర్వాత మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని రాఘవ లారెన్స్ 2007లో ముని అనే టైటిల్ తో మరోసారి భారీ హిట్ ను సాధించాడు రాఘవ.ఇక అప్పటి నుంచి మునికి సీక్వెల్ గా తీస్తూ హిట్స్ అందుకుంటూ వస్తున్నాడు.

ఈ సిరీస్ లో నే వచ్చిన కాంచన సినిమా కూడా సూపర్ హిట్ అందుకుంది.


ఇకపోతే ముని సినిమాతో మొదలైన ఈ సీక్వెల్ లో కథ, డైరెక్షన్ తో పాటు హీరోగా కూడా రాఘవ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఈ సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం నాలుగు సినిమాలను తెరకెక్కించారు.ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి.ఇక పోతే ఇదే కథాంశంగా తీసుకొని బాలీవుడ్ లో తెరకెక్కించబోతున్నారు.ఇక ఈ సినిమాను బాలీవుడ్ లో ప్రముఖ నటుడు హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు.

ఐదు సంవత్సరాల నుంచి బాలీవుడ్ లో విభిన్న కథలను ఎంచుకుని తనదైన శైలిలో ముందుకు వెళుతున్న అక్షయ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించడంలో అక్కడ మంచి క్రేజ్ అందుకుంది ఆ సినిమా.ఇక ఈ సినిమాకు బాలీవుడ్ లో లక్ష్మి బాంబ్ గా విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు పొందిన కియారా అద్వానీ ఈ సినిమాలో నటిస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో కియారా గ్లామర్ ఓ పెద్ద సెన్సేషన్ కాబోతోంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కావడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.ఈ సినిమా కూడా భారీ హిట్ సాధిస్తుందని బాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube