భయపెట్టే స్టంట్ లు చేస్తున్న అక్షయ్ కుమార్! సోషల్ మీడియాలో వైరల్

బాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు అక్షయ్ కుమార్.అక్షయ్ కుమార్ నటుడిగా కంటే తన రియలిస్టిక్ స్టంట్ లతో ఎప్పటికప్పుడు ఫాన్స్ కి ఉత్సాహం కలిగిస్తూ ఉంటాడు.

 Akshay Kumar Hangs Off Helicopter In Scary Stunt For Sooryavanshi-TeluguStop.com

మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి రావడంతో అక్షయ్ కుమార్ యాక్షన్ సన్నివేశాలను చాలా సునాయాసంగా చేసేస్తూ ఉంటాడు.ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ ఖాన్ లని క్రాస్ చేసుకొని నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చేస్తున్నాడు.

ప్రస్తుతం అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో సూర్యవంశీ అనే సినిమాలో నటిస్తున్నాడు.

తమిళంలో కార్తి హీరోగా తెరకెక్కిన ఖాకీ సినిమాకి ఇది హిందీ రీమేక్.

తాజాగా ఈ సినిమా షూటింగ్ సందర్భంగా అక్షయ్ కుమార్ ఓ రిస్కీ స్టంట్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఇప్పుడు ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

ఇందులో అక్షయ్ కుమార్ గాలిలో ఎగురుతున్న హెలికాప్టర్ క్రింద వేలాడుతూ ఉండగా బైక్ పైన రోహిత్ శెట్టి అతన్ని చేజ్ చేస్తున్నట్లు ఉంది.ఈ ఫోటో షేర్ చేసిన తర్వాత ఇలాంటి రిస్క్ స్టంట్ లు ఎవరు ఎవరు ప్రయత్నం చేయొద్దని, తాను కూడా నిపుణుల పర్యవేక్షణలో చేసినట్లు అక్షయ్ కుమార్ ట్విట్టర్ లో కామెంట్ కూడా పెట్టారు.

అయితే అక్షయ్ కుమార్ చేసిన ఈ రిస్కీ షాట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube