ఉల్లి కమ్ములని భార్యకి గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో... సోషల్ మీడియాలో వైరల్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ట్రెండ్ నడుస్తుంది.ఇప్పుడు మార్కెట్ లో అత్యంత ఖరీదైన నిత్యావసర వస్తువుగా మారిపోయిన ఉల్లిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.

 Akshay Kumar Gifts A Pair Of Onion Earrings To Twinkle Khanna-TeluguStop.com

చాలా మంది ఫన్నీ గా కామెంట్స్ పెడుతున్నారు.మరో వైపు కొంత మంది వ్యాపారులు ఉల్లిపాయలని ఆఫర్స్ గా కూడా ప్రకటించి వినియోగదారులని ఆకర్షిస్తున్నారు.

మరో వైపు పెళ్లిళ్లల్లో ఉల్లిపాయలని గిఫ్ట్ కూడా ఇస్తున్నారు.ఇల్లి ధరలు ప్రస్తుతం మార్కెట్ లో 150 నుంచి 200 వరకు ఉన్నాయని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఉల్లిపాయలమీద సెలబ్రెటీలు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

బాలీవుడ్ సూపర్ స్టార్, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తన భార్యకి ఏకంగా ఉల్లి గడ్డలతో డిజైన్ చేయించిన చెవి కమ్మలు గిఫ్ట్ గా ఇచ్చాడు.

తన భార్యకు తాను ఇచ్చిన చాలా ఖరీదైన బహుమానం అని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ ఫోటో చూసిన వారు సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఏ భర్త, ఏ భార్యకి ఎంత కంటే గొప్ప బహుమతి ఇవ్వలేరని, అక్షయ్ కుమార్ గ్రేట్ అంటే ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.అలాగే అక్షయ్ కుమార్ వంటి భర్త లభించడం ట్వింఖిల్ ఖన్నా అదృష్టం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి దేశ వ్యాప్తంగా ఉల్లి ఎఫెక్ట్ సామాన్యుల మీద ఏ స్థాయిలో ఉందొ అక్షయ్ చేసిన సెటైరికల్ పోస్ట్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.మరో వైపు ఉల్లిపాయల మీద టిక్ టిక్ లో కూడా ఫన్నీ వీడియోలు ప్రత్యక్షం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube