బాగమతి హిందీ రీమేక్ కి హీరోయిన్ ఫైనల్! త్వరలో సెట్స్ పైకి

బాహుబలి సినిమా తర్వాత అనుష్క మెయిన్ లీడ్ లో చేసిన థ్రిల్లర్ సినిమా బాగమతి.పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఏకంగా ఎబ్బై కోట్లు కలెక్ట్ చేసి అనుష్క స్టామినాకి నిదర్శనంగా నిలిచింది.

 Akshay Kumar Durgavati Starring Bhumi Pednekar-TeluguStop.com

ఇక ఆధ్యంతం కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క నిశ్శబ్దం అనే ఇండో-అమెరికన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతుంది.స్ట్రైట్ సినిమాకి దర్శకత్వం వహించిన అశోక్ ఈ హిందీ మూవీకి కూడా దర్శకత్వం వహించడం విశేషం.

ఇదిలా ఉంటే ప్రస్తుతం హాన్సికతో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న అశోక్ దానిని ఫినిష్ చేయగానే రీమేక్ తెరకెక్కించే పనిలో పడ్డట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాకి దుర్గావతి అనే టైటిల్ కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం.

ఇందులో భూమి ఫడ్నేకర్ అనుష్క పోషించిన పాత్రలో కనిపించనుంది.ఇక దీనిని బాలీవుడ్ అక్షయ్ కుమార్ తో కలిసి టి సీరీస్ తెరకెక్కుస్తుంది.

మరి ఈ సినిమా బాలీవుడ్ లో ఈ దర్శకుడుకి ఏ మేరకు హిట్ ఇస్తుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube