లాక్‌డౌన్ ఉన్నా షూటింగ్ పూర్తి చేసుకున్న స్టార్ హీరో  

Akshay Kumar Bollywood News - Telugu Ad Shoot, Akshay Kumar, Bollywood News, Corona Virus

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో పలు దేశాలు పూర్తిగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే.మనదేశంలో కూడా పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను దాదాపు రెండు నెలలకు పైగా అమలు చేసింది భారత ప్రభుత్వం.

 Akshay Kumar Bollywood News

అయితే కొంతమేర సడలింపులతో ప్రస్తుతం 4వ దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది.ఈ లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలు మూతపడ్డాయి.

ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన షూటింగ్‌లు, రిలీజ్‌లు అన్నీ కూడా వాయిదా పడ్డాయి.ఇలాంటి సమయంలో షూటింగ్ నిర్వహించాలని ఏ హీరో కూడా అనుకోవడం లేదు.

లాక్‌డౌన్ ఉన్నా షూటింగ్ పూర్తి చేసుకున్న స్టార్ హీరో-Gossips-Telugu Tollywood Photo Image

కానీ ఓ స్టార్ హీరో మాత్రం కరోనా ప్రభావం ఉన్నప్పటికీ షూటింగ్ జరుపుకోవడమే కాకుండా దాన్ని ముగించాడు.అయితే అక్షయ్ కుమార్ షూటింగ్ పూర్తి చేసింది సినిమాకు సంబంధించింది కాదట.

ప్యాడ్‌మాన్ చిత్ర దర్శకుడు బల్కి డైరెక్షన్‌లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ‘ఆయుష్మాన్ భారత్ క్యాంపెయిన్’కు చెందిన యాడ్‌‌ను అక్షయ్ కుమార్ పూర్తి చేశాడు.ఈ షూటింగ్‌ను కేవలం రెండు గంటల్లోనే పూర్తి చేశాడు ఈ హీరో.

ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా సినిమా రంగానికి చెందిన ఏ ఒక్క పని కూడా జరగడం లేదు.దీంతో సినీ రంగానికి చెందిన కార్మికులు పూట గడవక చాలా ఇబ్బందులు పడుతున్నారు.

కాగా పలువురు సెలబ్రిటీలు వారికి నిత్యావసరాలను అందిస్తూ వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.కాగా తెలంగాణలో సినిమా షూటింగ్‌లు వచ్చే నెల నుండి నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test