వామ్మో: హీరో అక్షయ్ కుమార్ ఇంత సంపాదిస్తున్నాడా...? ఏకంగా వరల్డ్‌ హయ్యెస్ట్‌ పెయిడ్‌ యాక్టర్లలో 6వ స్థానం...!

భారతదేశం లోని చిత్ర పరిశ్రమలో అనేక మంది హీరోలు కోట్లలో వారి నటించిన సినిమాలకు రెమ్యూనరేషన్ గా తీసుకుంటారు.ఇక దక్షిణ భారత దేశంలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో రజినీకాంత్ ముందు ఉంటారు.

 Akshay Kumar, Bollywood, Hollywood, Forbes List, Top 10, Latest-TeluguStop.com

ఇకపోతే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ అరుదైన రికార్డును సృష్టించాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… తాజాగా ఫోర్స్ సంస్థ విడుదల చేసిన టాప్ 10 జాబితాలో అక్షయ్ కుమార్ స్థానం సంపాదించుకున్నాడు.

ఈ టాప్ టెన్ లిస్టులో భారతదేశం నుండి కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే స్థానాన్ని సంపాదించుకున్నాడు.అది కూడా ఆరో స్థానంలో అక్షయ్ కుమార్ నిలిచాడు.ఈయన 2019 జూన్ నెల నుండి జూన్ 2020 నెల వరకు చూస్తే ఆయన ఏకంగా 48.5 మిలియన్ డాలర్లు అనగా మన భారతదేశం కరెన్సీలో రూ 362 కోట్లు గడించాడు.ఈ సంపాదనతో ఆయన ప్రపంచంలో టాప్ 10 జాబితాలో ఆరో స్థానాన్ని సంపాదించుకున్నారు.ఇక ఈ లిస్టులో ప్రపంచంలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోలలో డాన్వే జాన్సన్ మొదటి స్థానంలో ఉన్నాడు.

ఇక ఆయన తర్వాత ర్యాన్‌ రేనాల్డ్స్‌, మార్క్‌ వాల్‌ బెర్గ్‌, బెన్‌ అఫ్లెక్‌, విన్‌ డీజిల్‌, అక్షయ్ ‌కుమార్‌, లిన్‌ మాన్యుయల్‌ మిరండా, విల్ ‌స్మిత్‌, అడమ్‌ సాండ్లర్‌, జాకీ చాన్‌ లు వరుసగా పది స్థానాలలో నిలిచారు.ఇక గత సంవత్సరం అక్షయ్ కుమార్ హీరోగా నటించిన హౌస్ ఫుల్ 4, మిషన్ మంగల్, గుడ్ న్యూస్ చిత్రాలతో ఆయన బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించారు.

అక్షయ్ కుమార్ కేవలం సినిమాల ద్వారానే మాత్రమే కాకుండా పలు జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులకు సంబంధించి ప్రకటనలు కూడా చేస్తూ కోట్లలో గడిస్తున్నాడు అక్షయ్ కుమార్.భారతదేశం నుండి ఫోర్బ్స్ జాబితాలో ఆయన స్థానం సంపాదించడం నిజంగా గర్వించదగ్గ విషయమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube