పృథ్వీరాజ్ షూటింగ్ కి రెడీ అయిన అక్షయ్ కుమార్  

Akshay in preparation for Prithviraj Chauhan, Bollywood, Akshay Kumar, Historical Movie Pruthviraj Chauhan Movie - Telugu Akshay In Preparation For Prithviraj Chauhan, Akshay Kumar, Bollywood, Historical Movie Pruthviraj Chauhan Movie

ఈ మధ్య కాలంలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మైథలాజికల్ కథలు, అలాగే చారిత్రాత్మక కథలు తెరపైకి వస్తున్నాయి.దర్శక, నిర్మాతలు మన చరిత్ర పురుషులని వెండితెరపై ఆవిష్కరించడానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.

TeluguStop.com - Akshay In Preparation For Prithviraj Chauhan

బడ్జెట్ ఎంత అయినా కూడా పెట్టడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు.దీంతో దర్శకులు కూడా అలాంటి కథలతో సినిమాలు చేయడానికి ప్రత్యేక ఆశక్తి చూపిస్తున్నారు.

ఈ నేపధ్యంలో పోరాటయోధుడు, భారతీయ చారిత్రక పురుషుడు పృథ్వీరాజ్ చౌహన్ కథతో బాలీవుడ్ లోసినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ పృథ్వీ రాజ్ పాత్రలో నటిస్తున్నాడు.

TeluguStop.com - పృథ్వీరాజ్ షూటింగ్ కి రెడీ అయిన అక్షయ్ కుమార్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఆదిత్యా చోప్రా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

కరోనా టైమ్‌లోనూ ఖాళీలేకుండా షూటింగ్‌ల్లో పాల్గొంటున్న అక్షయ్‌కుమార్ స్కాంట్లాండ్‌లో బెల్‌బాటమ్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.అక్కడి నుంచి రాగానే పృథ్వీరాజ్‌ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారు.లాక్‌డౌన్‌ కారణంగా మేలో ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్‌ను తిరిగి కొనసాగించడానికి అక్షయ్‌ అంగీకరించడంతో చిత్ర యూనిట్‌ సిద్ధమవుతోంది.పృథ్వీరాజ్‌ సినిమా కోసం గతంలో వేసిన ప్యాలెస్‌ సెట్‌ వర్షాలకు దెబ్బతినడంతో వచ్చేవారం నుంచి మళ్లీ కొత్త సెట్‌ వేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుంది.మొత్తానికి బాలీవుడ్ లో వరుస హిట్స్ తో జోరు మీదున్న అక్షయ్ కుమార్ కెరియర్ లో నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా కచ్చితంగా హిట్ అయ్యే సినిమాలు కావడం విశేషం.

ఇప్పటికే బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ఉన్న అక్షయ్ ఈ సినిమాల దెబ్బతో టాప్ చైర్ లోకి వెళ్లిపోవడం పక్కా అనే మాట వినిపిస్తుంది.

#HistoricalMovie #Akshay Kumar #AkshayIn

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akshay In Preparation For Prithviraj Chauhan Related Telugu News,Photos/Pics,Images..