అక్షర హాసన్‌ మరీ బరితెగింపు మాటలు   Akshara Haasan Responding In Arrogant Way About Her Pics Leak     2018-11-08   10:34:09  IST  Ramesh P

కమల్‌ హాసన్‌ చిన్నకూతురు అక్షర హాసన్‌ కు సంబంధించిన కొన్ని ప్రైవేట్‌ ఫొటోలు తాజాగా లీక్‌ అయిన విషయం తెల్సిందే. అత్యంత అసభ్యంగా ఉన్న ఆ ఫొటోల్లో అక్షర తానే స్వయంగా సెల్ఫీలు తీసుకుంటున్నట్లుగా ఉంది. దాంతో తన సెల్ఫీలను తానే కావాలని లీక్‌ చేసి ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే మరి కొందరు మాత్రం అలా ఏం కాదు, అవి లీక్‌ అయినవే, అక్షర హాసన్‌కు తెలియకుండా జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో అక్షర హాసన్‌ స్పందించింది.

అక్షర హాసన్‌ మాట్లాడుతూ.. నేను ఒక సినిమా సమయంలో తీసుకున్న ఫొలోలు అవి, మీడియాలో ఆ ఫొటోలు చూసి షాక్‌ అయ్యాను. అవి ఎలా లీక్‌ అయ్యాయో అర్థం కావడం లేదు. సినిమా కోసం తీసుకున్నవి తప్ప, నేను కావాలని తీసుకున్నవి అయితే కావు అంటూ చెప్పుకొచ్చింది.

Akshara Haasan Responding In Arrogant Way About Her Pics Leak-

అయినా ఆ ఫొటోలపై మరీ ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారో నాకు అర్థం అవ్వడం లేదు. ఆ ఫొటోల్లో పెద్దగా తప్పు ఏం ఉందో చెప్పండి. చాలా నార్మల్‌గానే ఆ ఫొటోలు ఉన్నాయని, మరోసారి కూడా అలాంటి ఫొటోలను నేను తీసుకుంటాను, ఎవరేం అనుకున్నా పర్వాలేదు, నేను నాలాగా, నా వృతి పరంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది.

Akshara Haasan Responding In Arrogant Way About Her Pics Leak-

లీక్‌ విషయమై అక్షర హాసన్‌ స్పందించకపోయినా కూడా పెద్దగా పట్టించుకునే వారు కాదు. కాని మరీ అసభ్యంగా, అసహ్యంగా లీక్‌ గురించి అక్షర మాట్లాడటం వివాదాస్పదం అవుతుంది. మరీ బరితెగించి ఇలా ప్రవర్తిస్తుంది ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసభ్యంగా ఫొటోలు తీసుకోవడమే కాకుండా ఇలా వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ ఆగ్రహంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆమె మాటలు చూస్తుంటే ఆమె కావాలని తీసుకుని, లీక్‌ చేసిన ఫొటోలు అన్నట్లుగా చర్చ జరుగుతుంది. ఒక స్టార్‌ హీరో కూతురు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె ప్రవర్తించాలని కమల్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.