మాట మార్చి, పోలీసులను ఆశ్రయించింది.. పొట్టి పిల్ల మామూలు అమ్మాయి కాదు!

కమల్‌ హాసన్‌ చిన్న కూతురు అక్షర హాసన్‌కు చెందిన కొన్ని ప్రైవేట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాను కుదిపేసిన విషయం తెల్సిందే.చాలా అసభ్యంగా ఉన్న ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవ్వడంతో అంతా కూడా షాక్‌ అయ్యారు.

 Akshara Haasan Files Case On Leaked Her Photos-TeluguStop.com

అక్షర హాసన్‌ లో దుస్తుల్లో ఉండి సెల్ఫీలు తీసుకుంది.ఆ సెల్ఫీలు కాస్త బయటకు రావడంతో నానా రచ్చ జరిగింది.

అక్షర హాసన్‌పై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఆమె కావాలని విడుదల చేసిందని ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో షాకింగ్‌ గా అక్షర హాసన్‌ పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశం అయ్యింది.

ముంబయి పోలీసులకు, సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అక్షర హాసన్‌ ఫిర్యాదు ఇవ్వడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.మొన్నటికి మొన్న అక్షర హాసన్‌ ఆ ఫొటోల్లో తప్పేం ఉంది అంటూ సమాధానం ఇచ్చింది.కాని ఇప్పుడు పోలీసులను ఆశ్రయించి, ఆ ఫొటోలు లీక్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం చర్చనీయాంశం అవుతుంది.పోలీసులు ప్రస్తుతం ఫొటోల లీక్‌కు సంబంధించిన వివరాలను రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఇకపై ఆ ఫొటోలను షేర్‌ చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లుగా పోలీసులు చెప్పారు.వెబ్‌ మీడియాలో తన ఫొటోలకు ఆకట్టుకునే టైటిల్స్‌ ను పెట్టి మరీ పబ్లిసిటీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, వెంటనే వాటిని ఆపేయాల్సిందే అంటూ అక్షర హాసన్‌ ఆర్డర్‌ వేసింది.సెల్ఫీలు తీసుకున్న అక్షర హాసన్‌ వాటిని లీక్‌ చేసిందా లేదంటే మరెవ్వరైనా లీక్‌ చేశారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.పోలీసులు ఈ విషయమై ఎంక్వౌరీ చేయాలని కొందరు కోరుతున్నారు.

ఆమె లీక్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిందని కొందరు సోషల్‌ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube