అవకాశాల కోసం అక్కని ఫాలో అవుతున్న అక్షర హసన్

కమల్ హసన్ నట వారసురాలిగా తెరంగేట్రం చేసి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి శృతి హసన్.ఈ బ్యూటీ తండ్రి రికమండేషన్ లేకుండానే ఇండిపెండెంట్ గానే తన టాలెంట్ తో అవకాశాలు తెచ్చుకునే ప్రయత్నం చేసింది.

 Akshara Haasan Change Mindset For Heroine Chance-TeluguStop.com

ఆరంభంలో కొంత ఇబ్బంది అయిన గబ్బర్ సింగ్ సక్సెస్ తో ఒక్కసారిగా ఫేట్ మారిపోయింది.అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

నటిగా కూడా మంచి మార్కులు వేసుకోవడంతో పాటు గ్లామర్ షోకి కూడా రెడీగా ఉండటంతో శృతి హసన్ కి అవకాశాలు నిండుగా ఉన్నాయి.ప్రస్తుతం ప్రభాస్ కి జోడీగా సలార్ సినిమాలో శృతి హసన్ కథానాయికగా నటిస్తుంది.

 Akshara Haasan Change Mindset For Heroine Chance-అవకాశాల కోసం అక్కని ఫాలో అవుతున్న అక్షర హసన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరో వైపు బాలీవుడ్ లో కూడా అవకాశాలని అందిపుచ్చుకుంటుంది.అయితే శృతి హాసన్ ముందుగా ఛాన్స్ ల కోసం హాట్ ఫోటోషూట్ లని నమ్ముకుంది.

గ్లామర్ షోతో హాట్ ఫోటోషూట్ లు చేసి షోషల్ మీడియా ద్వారా అందరికి చేరేలా చేస్తే అవకాశాలు వాటికవే వెతుక్కుంటూ వస్తాయని ఆ దిశగానే ముందుగా ఈ బ్యూటీ తనలోని హాట్ యాంగిల్స్ ని పరిచయం చేసింది.

అవకాశాలు వచ్చిన తర్వాత నటిగా ప్రూవ్ చేసుకొని తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

ఇక అక్క బాటలోనే కమల్ హసన్ చిన్న కూతురు అక్షర హాసన్ కూడా నటిగా ఇప్పటికే తెరంగేట్రం చేసిన హీరోయిన్ గా మాత్రం అవకాశాలు అందుకోలేకపోయింది.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో మెప్పించింది.

అయితే ఆరంభంలో ఒకటి రెండు అవకాశాలు వచ్చిన కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి అవి ఎంత మాత్రం ఉపయోగపడలేదు.దీంతో అక్షర కూడా రూట్ మార్చి అక్క శృతి హసన్ బాటలోకి వచ్చేసినట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో హాట్ ఫోటోషూట్స్ మొదలు పెట్టి ఇన్స్టాగ్రామ్ ద్వారా విడిచిపెట్టింది.అలాగే లుక్స్ కూడా కంప్లీట్ గా మార్చేసి హీరోయిన్ ఫీచర్స్ లోకి వచ్చేసి గ్లామర్ షోతో ఎలివేట్ అయ్యే విధంగా ఫోటోలని వదిలింది.

మరి ఇప్పుడైనా అక్షర హసన్ కి ఎవరైనా హీరోయిన్ గా అవకాశం ఇస్తారేమో చూడాలి.

#Kollywood #Kamal Haasan #Shruthi Haasan #Akshara Haasan #Heroine Chance

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు