Justice for Disha : 2004లో రేపిస్ట్‌ అక్కూ యాదవ్‌ కు జరిగిందే ఇప్పుడు జరగాలి, అసలేం జరిగిందంటే..!  

Justice For Disha : 2004లో రేపిస్ట్‌ అక్కూ యాదవ్‌ కు జరిగిందే ఇప్పుడు జరగాలి, అసలేం జరిగిందంటే..! - Telugu 200 Woman In 2004, Akku Yadav, Didha, Priyanka Reddy, Telugu Viral In Social Media, Viral In Social Media, అక్కూ యాదవ్‌ కు జరిగిందే ఇప్పుడు జరగాలి

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దిశా సంఘటన తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెల్సిందే.పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.

 Akku Yadav 200woman In2004

ఆ నలుగురు నిందితులకు శిక్ష విధించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.ఆ నలుగురికి నిమిషం కూడా బతికే అర్హత లేదంటూ జనాలు ఏక కంఠంతో నినదిస్తున్నారు.

ఇలాంటి సమయంలో 2004వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.అప్పుడు జరిగినట్లుగా ఇప్పుడు కూడా జరగాలని జనాలు కోరుకుంటున్నారు.

అంతటి తెగువకు ఎవరైనా సాహసిస్తారా అంటూ చర్చ జరుగుతోంది.

2004 సంవత్సరంలో జరిగిన సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… నాగపూర్‌లోని కస్తూర్బా నగర్‌లో భరత్‌ కాళి చరణ్‌ అలియాస్‌ అక్కూ యాదవ్‌ అనే వాడు ఉండే వాడు.కస్తూర్బా నగర్‌లో అతడి ఆగడాలు అంతా ఇంతా కాదు.రౌడీగా చెలామని అవుతూ పోలీసులు మరియు రాజకీయ నాయకుల అండదండలతో స్థానిక దళితులపై అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉండేవాడు.

పదుల సంఖ్యలో అమ్మాయిలను ఆడవారిని లొంగతీసుకున్నాడు.మరి కొందరిని రేప్‌ చేశాడు.

రెండు మూడు సంవత్సరాల పాటు అతడి ఆగడాలు కొనసాగాయి.

ఎవరైనా అక్కూ యాదవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఫిర్యాదు స్వీకరించక పోగా అతడికి రివర్స్‌ ఆ బాధితుల గురించి ఫిర్యాదు చేసే వారు.దాంతో అతడు ఫిర్యాదు చేసిన వారిని మరింతగా వేదించేవాడు.అలా అక్కూ యాదవ్‌ ఆగడాలు శృతి మించుతున్న సమయంలో స్థానికంగా చదువుకున్న కొందరు ఆడవారు డైరెక్ట్‌గా కమీషనర్‌ వద్దకు వెళ్లారు.

స్థానిక పోలీసులు కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయడం లేదంటూ ఫిర్యాదు చేశారు.

దాంతో కమీషనర్‌ నేరుగా కేసులోకి దిగి అక్కూ యాదవ్‌ను అరెస్ట్‌ చేశాడు.

అక్కూ యాదవ్‌ను అరెస్ట్‌ చేయగా బెయిల్‌ కోసం దరకాస్తు చేసుకున్నాడు.బెయిల్‌ ఖచ్చితంగా వస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు.

కోర్టు హాలులోనే అక్కూ యాదవ్‌ మహిళల వైపు చూస్తూ బయటకు వస్తా మీ సంగతి చూస్తానంటూ హెచ్చరించాడు.ఆ మాటలు విన్న పోలీసులు నవ్వి ఊరుకున్నారు.

అక్కడ ఆడవారికి అందరికి కూడా అతడు బయటకు వస్తే మరింతగా రెచ్చి పోవడం ఖాయం అనుకున్నారు.అనుకున్నదే తడువుగా అతడిని మళ్లీ బయటకు రానియవద్దని భావించారు.

కోర్టుకు దాదాపుగా 200 మహిళలు చేరుకున్నారు.వారితో కారం కత్తులు తీసుకు వచ్చారు.కోర్టులో బెయిల్‌ విచారణ జరుగుతున్న సమయంలో ఒక లేడీని చూసి అక్కూ యాదవ్‌ నవ్వాడు.దాంతో ఆమె సివంగిలా దూకింది.అతడిపై దూకి కొడుతున్న సమయంలోనే ముందుగా అనుకున్న ప్రకారం దాదాపుగా రెండువందల మంది ఆడవారు తమ వద్ద ఉన్న వాటితో దాడి చేశారు.కోర్టులో పోలీసులు న్యాయవాదులు అంతా కూడా పారిపోయారు.

అక్కూ యాదవ్‌ శరీరంపై ఏకంగా 75 కత్తి పోట్లు ఉన్నాయి.వాడికి తగిన శిక్ష పడింది.

పాతిక మంది మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసులు వారిని అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించగా స్థానికులు మొత్తం కూడా మేమే అతడిని అరెస్ట్‌ చేశాం అంటూ ముందుకు వచ్చారు.అలా ఆడవారు అంతా కూడా ఏకతాటిపై ఉండటంతో ఎవరిని అరెస్ట్‌ చేయకుండానే అక్కూ యాదవ్‌ హత్య కేసును క్లోజ్‌ చేశారు.అలాంటి తరహా సంఘటనలు మళ్లీ దిశా విషయంలో జరగాలంటూ కొందరు కోరుకుంటున్నారు.

కాని న్యాయవ్యస్థపై నమ్మకం ఉంచి జనాలు ఇప్పటికి వారికి శిక్ష విధించాలని ప్రభుత్వాలను కోరుకుంటున్నారు.

#Priyanka Reddy #Didha #Akku Yadav

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akku Yadav 200woman In2004 Related Telugu News,Photos/Pics,Images..