అక్కినేని నాగేశ్వరరావుపై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు.. మెంటల్ మామయ్య అంటూ ట్రోల్స్?

టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలయ్య బాబు తాజాగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి.

 Akkineni Sv Ranga Rao Fans Associations Fires Nandamuri Balakrishna Details, Bal-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం బాలయ్య బాబు ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ సినిమా మంచి విజయం సాధించిన సందర్భంగా బాలయ్య బాబు తాజాగా సక్సెస్ మీట్ లో టాలీవుడ్ సినీ దిగ్గజాలను కించపరుస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాలయ్య బాబు వివాదంలో చిక్కుకున్నారు.

దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పై బాలయ్య బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు.దీంతో అక్కినేని అభిమానులు బాలయ్య బాబు పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.సక్సెస్ మీట్ లో భాగంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.అక్కినేని తొక్కినేని అంటూ వ్యాఖ్యానించడం సరికాదని అందుకు

బాలయ్య బాబు క్షమాపణలు చెప్పాలి అంటూ అక్కినేని అభిమాన సంఘాలు అలాగే కాపునాడు అభిమాన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో బాలయ్య బాబు పై విరుచుకుపడుతూ దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.మెంటల్‌ బాలకృష్ణ, ముద్దుల మామయ్య కాదు.

మెంటల్‌ మామయ్య అనే హ్యాష్‌ట్యాగ్ లను ట్విటర్‌ వేదికగా ట్రెండింగ్‌లోకి వచ్చాయి.అలాగే వివిధ సందర్భాల్లో

బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర ప్రవర్తనలకు సంబంధించిన వీడియోలను అక్కినేని ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు.అందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ మెంటల్ మామయ్య అంటూ దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.మరి బాలయ్య బాబు ఈ వివాదం పై స్పందించి క్షమాపణలు చెబుతారా లేదా అన్నది చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube