ఆ సినిమా కోసం అక్కినేని సుశాంత్ బాగానే పెంచేసాడుగా…  

Akkineni Sushanth, Telugu young Hero, Ichata Vahanamulu Nilaparadu, Movie update, New look, Akkineni Sushanth New Look For Next Movie - Telugu Akkineni Sushanth, Akkineni Sushanth New Look For Next Movie, Ichata Vahanamulu Nilaparadu, Movie Update, Movie Uypdate, New Look, Telugu Young Hero

తెలుగులో ప్రముఖ దర్శకులు జి రవి చరణ్ రెడ్డి దర్శకత్వం వహించిన “కాళిదాసు” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమైన అక్కినేని సుశాంత్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే మొదట్లో అడపా దడపా సినిమాలతో సుశాంత్  బాగానే ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఎందుకో ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు.

 Akkineni Sushanth New Hairstyle Look Instagram

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగులు లేక ఇంటి వద్దనే ఉంటున్నాడు.అంతేకాక సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉన్నాడు.

అయితే తాజాగా సుమంత్ తన స్టైలిష్ లుక్ ను అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.దీంతో సుశాంత్ అభిమానులు ఈ స్టైలిష్ లుక్ లో సూపర్ గా ఉన్నావని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆ సినిమా కోసం అక్కినేని సుశాంత్ బాగానే పెంచేసాడుగా…-Latest News-Telugu Tollywood Photo Image

అంతేగాక సుశాంత్ తన తదుపరి చిత్రం కోసం హెయిర్ స్టైల్ ని పూర్తిగా మార్చేశాడని చర్చించుకుంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సుశాంత్ అక్కినేని టాలీవుడ్ నూతన దర్శకుడు దర్శన్ దర్శకత్వం వహిస్తున్న “ఇచట వాహనాలు నిలుపరాదు” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడంతో మంచి స్పందన వచ్చింది.కాగా ఆ మధ్య మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన  “అల వైకుంఠపురములో” చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి  ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.

#New Look

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akkineni Sushanth New Hairstyle Look Instagram Related Telugu News,Photos/Pics,Images..