నేను నాగార్జునతో ఆ సినిమా చేయకుండా ఉండాల్సిందంటున్న సుమంత్...

తెలుగులో ప్రముఖ దర్శకుడు బాలశేఖరన్ దర్శకత్వంలో వచ్చినటువంటి “స్నేహమంటే ఇదేరా” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈ చిత్రంలో హీరోలుగా అక్కినేని నాగార్జున, అక్కినేని సుమంత్ నటించగా హీరోయిన్లుగా భూమిక చావ్లా, స్వర్గీయ ప్రత్యూష, నటించారు.

 Akkineni Sumanth, Tollywood Hero, Akkineni Nagarjuna, Snehamante Idera, Balaseka-TeluguStop.com

ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించింది.అయితే ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది.

అయితే తాజాగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హీరో సుమంత్ ఈ విషయంపై స్పందించారు.

ఇందులో భాగంగా తాను మరియు తన చినమామ నాగార్జున కలిసి నటించినటువంటి “స్నేహమంటే ఇదేరా” చిత్రం ఫెయిల్యూర్ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు.

అలాగే ఈ చిత్రానికి తాను మరియు నాగార్జున స్నేహితులు అనే అంశం పెద్ద మైనస్ గా ఉందని, అంతే కాక ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేక పోయారని అందువల్ల ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణంగా పరాజయం పాలైందని తెలిపాడు.అయితే ఇలా జరగడం తనకు రెండవసారి అని మొదట్లో తాను మరియు తన తాతయ్య స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన టువంటి పెళ్లి సంబంధం అనే చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైందని చెప్పుకొచ్చాడు.

అంతేగాక ఈ రెండు చిత్రాల కథల విషయంలో కూడా కొంత పట్టు లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయని తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అక్కినేని సుమంత్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న  “కపటదారి” అనే  చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత ధనుంజయ నిర్మిస్తున్నాడు.అయితే ఈ చిత్రాన్ని కన్నడలో మంచి విజయం సాధించినటువంటి “కవులదారి” అనే చిత్రానికి రీమేక్ గా ఉంది.

ఈ చిత్రంలో హీరో సుమంత్ సరసన నందిత శ్వేత హీరోయిన్ గా నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube