సోషల్ మీడియాలో సమంత చివరి ఫోటో ఇదేనట!  

akkineni samantha workout pics goes viral, urlife, Samantha, pushups, Samanktha workouts, Upasana Konidela - Telugu Akkineni Samanta, Akkineni Samantha Workout Pics Goes Viral, Pushups, Samanktha Workouts, Samanta Work Outs, Samantha, Upasana, Upasana Konidela, Urlife

అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.కరోనా, లాక్ డౌన్ వల్ల షూటింగ్ లకు దూరంగా ఉంటున్న సమంత అభిమానులతో సోషల్ మీడియా ద్వారా సినిమాలకు సంబంధించిన విశేషాలను, ఇతర వివరాలను పంచుకుంటూ ఉంటారు.

TeluguStop.com - Akkineni Samantha Workout Pics Goes Viral

ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే సామ్ జిమ్ లో వ్యాయామానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు.
కొన్ని రోజుల క్రితం రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ప్రారంభించిన urlife.co.in వెబ్ సైట్ ను సామ్ ప్రమోట్ చేస్తున్నారు.ఈ వెబ్ సైట్ కోసం సామ్ ఉపాసనకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.తాజాగా సామ్ తన సోషల్ మీడియా ఖాతాలలో పుష్ అప్స్ చేస్తున్న ఒక ఫోటోను పోస్ట్ చేశారు.సామ్ పోస్ట్ చేసిన ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇప్పటికే జిమ్ వ్యాయామానికి సంబంధించి అనేక ఫోటోలను పోస్ట్ చేసిన సామ్ ఈ ఫోటోనే చివరి ఫోటో ప్రామిస్ అంటూ వర్కౌట్ ఫోటో పోస్ట్ చేసింది.

TeluguStop.com - సోషల్ మీడియాలో సమంత చివరి ఫోటో ఇదేనట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సమంత యూఆర్ లైఫ్ వెబ్ సైట్ కోసం ఫోటో షూట్లలో కూడా పాల్గొంది.

మరోవైపు పెళ్లి తరువాత పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తున్న సమంత ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.సమంత నటించిన ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదలవుతుందా.? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సమంత ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది.

ఇప్పటికే ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ కు సంబంధించిన షూటింగ్ పూర్తైందని సామ్ పేర్కొంది.సమంత పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు సైతం కొన్ని రోజుల క్రితమే పూర్తయ్యాయి.

స్టార్ హీరోయిన్ సామ్ నటించిన వెబ్ సిరీస్ కావడంతో ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ పై అంచనాలు భారీగా పెరిగాయి.త్వరలో ఓటీటీలో విడుదల కాబోతున్న ఈ వెబ్ సిరీస్ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

#Pushups #Upasana #Samantha #Urlife

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akkineni Samantha Workout Pics Goes Viral Related Telugu News,Photos/Pics,Images..