మరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన అక్కినేని సమంత…!  

akkineni samantha who has become a brand ambassador for another company brand ambassador, samantha, heroien house roof, lockdown, cinima shootings, myntra - Telugu @samanthaprabhu2, Brand Ambassador, Cinima Shootings, Heroien House Roof, Lockdown, Myntra, Samantha

అక్కినేని సమంత… ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈవిడ అనతికాలంలోనే గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లో పేరుగాంచింది.మొదటి సినిమాతోనే తన భర్త అక్కినేని నాగచైతన్య సరసన జోడి కట్టి తన నటన నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసింది.

TeluguStop.com - Akkineni Samantha Who Has Become A Brand Ambassador For Another Company

తనకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పాటు చేసుకుంది.ఆ తరువాత క్రమక్రమంగా టాలీవుడ్ పరిశ్రమలో ఉన్న టాప్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి టాప్ హీరోయిన్ స్థాయికి చాలా కొద్ది సమయంలోనే చేరుకుంది.

సమంత టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే అక్కినేని మూడో తరం వారసుడు అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి వివాహం చేసుకుంది.దీంతో అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా మారిపోయింది ఈ అందాల ముద్దుగుమ్మ.

TeluguStop.com - మరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన అక్కినేని సమంత…-General-Telugu-Telugu Tollywood Photo Image

పెళ్లి తర్వాత కూడా తనదైన విభిన్న కథలను ఎంచుకుని సినిమాలు చేస్తోంది సమంత.సమంత కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా, మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో కూడా బాగానే సంపాదిస్తూ ఉంది.

ఇప్పటికే అనేక రకాల వాణిజ్య ప్రకటనలతో ప్రతిరోజు బుల్లితెరపై అక్కినేని సమంత బ్రాండ్ అంబాసిడర్ గా కనబడుతూనే ఉంది.ఇక తాజాగా ఈ లిస్టులో మరో కంపెనీ కూడా చేరిపోయింది.

తాజాగా ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సైట్ ‘ మింత్ర ‘ తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.దీంతో సమంత దక్షిణాది ప్రేక్షకులకు అంబాసిడర్ గా పని చేయబోతుంది.

లాక్ డౌన్ సమయంలో ఎటువంటి షూటింగ్స్ లేకపోవడంతో ఇంట్లో ఉండి యోగ, యాక్టింగ్, కుకింగ్ లాంటి వాటిపై దృష్టి పెట్టింది.ఇక ప్రస్తుతం ఈవిడ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కూడా నటిస్తోంది.

అలాగే లాక్ డౌన్ సమయలో తన ఇంటిని పూర్తిగా ఒక వ్యవసాయ క్షేత్రంలా మార్చేసింది సమంత.ఇంట్లోనే ఉంటూ ఆకుకూరలు, కూరగాయలు లాంటి వాటిని ఇంటి పై భాగా పెంచింది.

అలాగే జూబ్లీ హిల్స్ ప్రాంతం లో ఏకం అనే ప్రీ స్కూల్ ను కూడా ప్రారంభించింది.

#Lockdown #Myntra #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akkineni Samantha Who Has Become A Brand Ambassador For Another Company Related Telugu News,Photos/Pics,Images..