లాక్ డౌన్ ఎఫెక్ట్ తో కూరగాయలు పండిస్తున్న సమంత

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ ఒక్కసారిగా అందరి జీవితాలని మార్చేసింది.బిజీ జీవితాలలో పరుగులు పెట్టె ప్రజలని ఇంటి పట్టునే ఉండేలా చేసింది.

 Samanta Explains Why She Has Turn As A Former During Lock Down, Akkineni, Corona-TeluguStop.com

ఎంతో మంది ఉద్యోగాలు పోవడానికి కారణం అయ్యింది.రోజు గడవడం కూడా కష్టంగా మారిపోయింది.

కోట్ల రూపాయిలు సంపాదన ఉన్న బయటకి ధైర్యంగా వెళ్లి కావాల్సినవి తెచ్చుకోలేని పరిస్థితి.కొద్దో గొప్పో కేవలం వ్యవసాయాన్ని నమ్ముకున్న వారి జీవితాలు మాత్రమే కరోనా సమయంలో కొంత బాగున్నాయి.

ఇదే విషయంలో సమంతకి కూడా జ్ఞానోదయం అయ్యింది.కరోనా కష్టకాలంలో పడిన ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని మేడపైన కూరగాయలు పండించడం మొదలు పెట్టింది.

దీనికి సంబందించిన వీడియోని సోషల్ మీడియాలో ద్వారా షేర్ చేసుకొని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

అందరూ తమకు నచ్చిన పనిని సమర్థంగా చేయడానికి ఇష్టపడతారని, సృజనాత్మకతకు కొదవలేదని చెప్పింది.

డ్యాన్స్‌, వంట చేయడం, కవిత్వం రాయడం లాంటి పనులు ఎన్నో చేస్తారని తెలిపింది.అయితే వాటిని తాను చేయలేనని తనకు తెలుసని సమంత చెప్పింది.ప్రతి ఒక్కరూ చేసే దానికి తాను కాస్త భిన్నంగా చేయాలని అనుకుంటానని వివరించింది.చాలా సులభమైన తోటపనికి సంబంధించి తాను సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో పోస్ట్‌లు చేశానని చెప్పింది.

కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ ప్రకటించగానే అందరిలాగే తానూ ఆశ్చర్యపోయానని, ఆందోళన చెందానని చెప్పింది.సరకుల కోసం తన భర్తతో కలిసి తాను సూపర్‌మార్కెట్‌కు పరిగెత్తానని చెప్పింది.

ఇలా చాలా మంది చేసి ఉంటారని తెలిపింది.తెచ్చుకున్న సరకులన్నీ ఎన్ని రోజులు వస్తాయో లెక్కపెట్టామని, ఒకవేళ అవన్నీ అయిపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితిని ఊహించుకుని ఆందోళన చెందామని చెప్పింది.

ఈ పరిస్థితులే తనకు ఓ పాఠాన్ని నేర్పాయని చెప్పింది.అవసరమైన ఆహారాన్ని పండించుకోవాలని నిర్ణయించుకున్నానని సమంత సోషల్ మీడియా వేదికగా చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube