ఏఎన్ఆర్ తో కలిసి నాగార్జున ఎన్ని సినిమాలు చేశాడో తెలుసా!  

Akkineni nageswar rao, akkineni nagarjuna, combination movies,tolly wood - Telugu Manam, Nagarjuna, Nageswararao, Sriramadasu

నిజ జీవితంలో తండ్రీకొడుకులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున రీల్ లైఫ్ లో కూడా పలు సినిమాల్లో తండ్రీకొడుకుల పాత్రల్లో నటించారు.తెలుగు సినీ పరిశ్రమకు సీనియర్ ఎన్టీఆర్ ఒక కన్నుగా నిలిస్తే అక్కినేని నాగేశ్వరరావు మరో కన్నుగా నిలిచారు.

TeluguStop.com - Akkineni Nageswarrarao Nagarjuna Combination Movies

నాగేశ్వరరావు రక్తాన్నే కాక నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నాగార్జున నేటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు.

బుల్లితెర రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బుల్లితెరపై కూడా సంచలనాలు సృష్టిస్తున్నారు.

TeluguStop.com - ఏఎన్ఆర్ తో కలిసి నాగార్జున ఎన్ని సినిమాలు చేశాడో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నాగేశ్వరావు నాగార్జున కాంబినేషన్లో ఆరు సినిమాలు తెరకెక్కాయి.కెరీర్ మొదట్లో ఫ్లాపుల వల్ల ఇబ్బందులు పడిన నాగార్జునను నాగేశ్వరరావు కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకునేలా చేసి స్టార్ హీరోగా ఎదిగేలా చేశారు.

ఎదురైన ప్రతి అనుభవం నుంచి తనను తాను మలుచుకుంటూ మహానటుడిగా పేరు తెచ్చుకున్నారు.

బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన కలెక్టర్ గారి అబ్బాయి చిత్రంలో నాగార్జున, నాగేశ్వరరావు కలిసి నటించారు.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన అగ్నిపుత్రుడు సినిమాలో సైతం కలిసి నటించారు.ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.రావుగారిల్లు అనే సినిమాలో నాగార్జున నాగేశ్వరరావు కలిసి నటించగా నాగేశ్వరరావు నిజ జీవిత పాత్రలో కనిపించడం గమనార్హం.

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఇద్దరూఇద్దరే సినిమాలో నాగేశ్వరరావు, నాగార్జున కలిసి నటించగా ఈ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది.దర్శకేంద్రుని దర్శకత్వంలో నాగార్జున, నాగేశ్వరరావు కలయికలో తెరకెక్కిన మరో చిత్రం శ్రీరామదాసు, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది.

నాగార్జున, నాగేశ్వరరావు కాంబినేషన్లో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మనం వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చివరి సినిమా.ఈ సినిమాలు మాత్రమే కాక నాగార్జున బాలనటుడిగా రెండు సినిమాల్లో నటించాడు.

#Manam #Sriramadasu #Nagarjuna #Nageswararao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akkineni Nageswarrarao Nagarjuna Combination Movies Related Telugu News,Photos/Pics,Images..