తెలుగులో హీరోగా కనీవిని ఎరుగని విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయిన హీరోలలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు.తాజాగా అమల మాట్లాడుతూ మామగారు ఏఎన్నార్ చివరివరకు శ్రమిస్తూనే ఉన్నారని తెలిపారు.
ఒకవైపు కేన్సర్ వ్యాధితో బాధ పడుతూనే మరోవైపు మనం మూవీకి ఏఎన్నార్ పని చేశారని అమల వెల్లడించారు.ఆస్పత్రి బెడ్ పై నుంచి మామగారు మనం మూవీకి డబ్బింగ్ చెప్పారని అమల చెప్పుకొచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ల ఆశీర్వాదం వల్ల తాను అద్భుతమైన జీవితాన్ని గడిపానని ఆయన చెప్పారని అమల కామెంట్లు చేశారు.కేన్సర్ తో బాధ పడుతున్న సమయంలో మీరు విచారించొద్దని ఆయన మాతో చెప్పారని అమల చెప్పుకొచ్చారు.
మనం మనల్ని ప్రేమించుకోవడం లేదని పర్యావరణాన్ని ప్రేమించడం లేదని ఇలా చేయడం వల్లే కేన్సర్ విజృంభిస్తోందని అమల వెల్లడించారు.

పురుగు మందులు, కలుపు మందులు కేన్సర్ కు కారణమవుతాయని ఆమె చెప్పుకొచ్చారు.ఈ విషయాలు చాలామందికి తెలిసినా వాటిని వినియోగిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.కేన్సర్ గురించి ప్రతి ఒక్కరూ అవగాహనను పెంచుకోవాలని అమల కామెంట్లు చేశారు.
కేన్సర్ గురించి ప్రతి ఒక్కరూ అవగాహనను కలిగి ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు.అమల చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
అమల ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.అమల నటిస్తున్న సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
అమల పలు సేవా కార్యక్రమాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.అమల సినిమాలలో నటిస్తున్నా ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం లేదని తెలుస్తోంది.
ఒకే ఒక జీవితం అనే సినిమాలో అమల నటించగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా నటించడం గమనార్హం.
ఒకే ఒక జీవితం రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.