తెలుగు పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు.ఎన్నో వందల సినిమాల్లో నటించిన ఆయన.పెరిగిన వయసు రీత్యా సినిమాలు చేయడం తగ్గించాలి అనుకున్నాడు.మంచి కథ వస్తే తప్పి సినిమాలు చేయకూడదు అనుకుంటున్నారు.అదే సమయంలో దాంపత్యం అనే మంచి కథతో నాగేశ్వర్ రావు దగ్గరకు వచ్చాడు.ఆ రోజుల్లో ఎంత పెద్ద నటుడు అయినా.
రచయిత కథ చెప్పడానికి వస్తే చాలా గౌరవంగా చూసుకునే వారు.అటు సత్యమూర్తి ఈ కథ చెప్పడానికి మద్రాసు నుంచి హైదరాబాద్ కు వచ్చాడు.
నాగేశ్వర్ రావుకు తన కథను పూర్తిగా వివరించారు.కథలో కొన్ని చోట్ల బూతులు ఉండటాన్ని ఏఎన్నార్ గుర్తించారు.
కథ బాగానే ఉంది.నాకు ఓకే.మరి దర్శకుడు ఏం చెప్పారు? అని అడిగాడు.దర్శకుడికి కూడా కథ బాగా నచ్చిందండీ అని చెప్పారు.
అయితే సరే అన్నాడు ఏఎన్నార్.చదలవాడ బ్రదర్స్ తిరుపతిరావు, శ్రీనివాసరావు నిర్మాణంలో సినిమా షూటింగ్ మొదలైంది.జయసుధ, సుహాసిని హీరోయిన్లుగా సెలెక్ట్ అయ్యారు.
అయితే షూటింగ్ మాత్రం హైదరాబాద్ లోనే జరగాలని ఏఎన్నార్ పట్టుబట్టారు.
కానీ అప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసులో ఉండేది.అక్కినేని కోరిక మేరకు దాంపత్యం సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరిపేందుకు ఓకే చెప్పారు దర్శక నిర్మాతలు.
కానీ సినిమా ఓపెనింగ్ కోసం హైదరాబాద్ కు వెళ్లడం ఇష్టం లేని దర్శకుడు కోదండరామిరెడ్డి.అక్కినేనికి ఫోన్ చేసి.
సర్, వేరే సినిమాల షూటింగ్స్ తో కాస్త బిజీగా ఉన్నాను.మీరు ఏమి అనుకోకపోతే సినిమా ఓపెనింగ్ మద్రాసులో పెట్టుకుందాం.
మీరు మద్రాసు రావాలి సర్ అని మర్యాదగా అడిగాడు.మద్రాసులో తెలుగు సినిమా షూటింగ్ చేయడం, అలాగే ఓపెనింగ్ చేయడం కూడా నాగేశ్వరరావుకు అసలు ఇష్టం ఉండేది కాదు.
అందుకే నాగేశ్వరరావు.మద్రాసులో షూటే కాదు, ఓపెనింగ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు.
అల ఆ సినిమా ఓపెనింగ్ లోనే అభిప్రాయభేదాలు వచ్చాయి.
ఆ తరువాత దర్శకుడు కోదండరామిరెడ్డి ఔట్ డోర్ లో షూట్ ప్లాన్ చేశారు.
ముందుగా పాటతో షూటింగ్ ప్రారంభించారు.అయితే, అప్పుడే ఆ పాటను చూసిన అక్కినేని మొహంలో ఒక్కసారిగా కోపం ఎక్కువవుతుంది.ఆ పాట చరణంలో ఓ చిన్న బూతు ఉంది.సడెన్ గా అక్కినేని కుర్చీలోంచి ఒక్కసారిగా సీరియస్ అవుతూ పైకి లేచి.ఆవేశంతో ఊగిపోయారు.నేను హీరోగా నటిస్తున్న చిత్రం ఇది.పైగా నా పై తీసే పాటలో బూతులు పెడతారా? ఏమనుకుంటున్నారు? జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.నేను ఈ సినిమా చేయడం లేదంటూ యూనిట్ లో అందరూ వినేలా గట్టిగా కేకలు వేశారు.
తలపై విగ్గు తీసి నేల పై విసిరి కొట్టి అక్కడ నుండి కోపంగా వెళ్లిపోయారు.ఆ తర్వాత నిర్మాతలు అక్కినేనికి సర్ది చెప్పారు.ఏఎన్నార్ ఆ సినిమా చేశారు.