బిగ్ బాస్ విషయంలో అసంతృప్తితో నాగార్జున.. ఏం జరిగిందంటే?  

akkineni nagarjuna unhappy with bigg boss reality show, Akkineni Nagarjuna, Bigg Boss Show, Wild Dog Shooting, TRP Ratings, Star Maa, Manali - Telugu Akkineni Nagarjuna, Akkineni Nagarjuna Unhappy With Bigg Boss Reality Show, Bigg Boss 4, Bigg Boss Ratings, Bigg Boss Show, Manali, Star Maa, Trp Ratings, Wild Dog, Wild Dog Shooting

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోకు తెలుగులో సీజన్ 1కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, సీజన్ 2కు నాని, సీజన్ 3కు అక్కినేని నాగార్జున హోస్ట్ లుగా వ్యవహరించారు.సీజన్ 4కు బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జునను సంప్రదించగా సీజన్ 4కు కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

TeluguStop.com - Akkineni Nagarjuna Unhappy With Bigg Boss Reality Show

అయితే బిగ్ బాస్ విషయంలో నాగార్జున తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని.ఈ షో చేస్తున్నందుకు ఆయన హ్యాపీగా లేరని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

నాగార్జున బిగ్ బాస్ విషయంలో అసంతృప్తితో ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి.కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల చాలామంది సీనియర్ స్టార్ హీరోలు షూటింగ్ లకు దూరంగా ఉన్నారు.

TeluguStop.com - బిగ్ బాస్ విషయంలో అసంతృప్తితో నాగార్జున.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయినప్పటికీ నాగార్జున మాత్రం ధైర్యంగా బిగ్ బాస్ షో చేయడానికి ముందుకొచ్చారు.తొలిరోజు 18.5 టీఆర్పీ రేటింగ్ తో గత సీజన్ల లాంఛింగ్ ఎపిసోడ్ల టీఆర్పీ రేటింగ్ లను క్రాస్ చేసి బుల్లితెరపై సత్తా చాటారు.

అయితే బిగ్ బాస్ షో రేటింగ్స్ ప్రతివారం అంతకంతకూ తగ్గుతున్నాయి.

స్టార్ మా ఛానెల్ లో కొన్ని సీరియళ్లు అందుకున్న రేటింగ్ లలో బిగ్ బాస్ షోకు సగం రేటింగ్ కూడా రావడం లేదు.వీకెండ్ ఎపిసోడ్స్ రేటింగ్ కు వీక్ డేస్ ఎపిసోడ్ రేటింగ్ కు పొంతనే లేకపోవడం నాగార్జున అసంతృప్తికి కారణమని తెలుస్తోంది.

మరోవైపు కుమార్ సాయి ఎలిమినేట్ అయిన సమయంలో కొందరు నెటిజన్లు నాగార్జునను ట్రోల్ చేశారు.

ఈ ట్రోలింగ్ కూడా నాగార్జునను బాధించిందని ప్రచారం జరుగుతోంది.

బిగ్ బాస్ నిర్వాహకులకు ఇప్పటికే షోకు సంబంధించి నాగార్జున కీలక సూచనలు చేశాడని సమాచారం.మరోవైపు వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలీ వెళ్లిన నాగార్జున ఈ వారం మాత్రం బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లకు హాజరు కారని తెలుస్తోంది.

#Wild Dog #Manali #Bigg Boss Show #Bigg Boss 4 #Star Maa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akkineni Nagarjuna Unhappy With Bigg Boss Reality Show Related Telugu News,Photos/Pics,Images..