పాపం ఆ దర్శకుడి కెరీర్‌ నాశనం చేసిన నాగార్జున

అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కి సక్సెస్‌ అయిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన.ఆ చిత్రంలోని బంగార్రాజు పాత్ర అందరికి బాగా కనెక్ట్‌ అయ్యింది.

 Akkineni Nagarjuna Delaying Bangarraju Director Kalyankrishna-TeluguStop.com

నాగార్జున ఇమేజ్‌కు తగ్గట్లుగా భలే వచ్చిందే అంటూ విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు.అందుకే ఆ పాత్రనే బేస్‌ చేసుకుని బంగార్రాజు టైటిల్‌తో అక్కినేని నాగార్జున సినిమా చేసేందుకు ఆసక్తి చూపించాడు.

స్వయంగా తానే నిర్మిస్తానంటూ కూడా ప్రకటించాడు.

గత రెండు సంవత్సరాలుగా దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ బంగార్రాజు చిత్రం కోసం పని చేస్తూనే ఉన్నాడు.

బంగార్రాజు చిత్రం కథ కోసం నెలల తరబడి అన్నపూర్ణ స్టూడియోలో రైటర్స్‌తో కలిసి చర్చలు జరిపాడు.ఆమద్య కథ పూర్తి అయ్యింది.నాగార్జున మరియు నాగచైతన్యలు కలిసి నటించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.రమ్యకృష్ణను కూడా ఎంపిక చేశారనే టాక్‌ వచ్చింది.

ఆ సమయంలోనే మన్మధుడు 2 చిత్రం విడుదలై తీవ్ర నిరాశ పర్చింది.

Telugu Kalyan Krishna, Naga Chaitanya, Ramya Krishna-

మన్మధుడు 2 చిత్రం తర్వాత నాగార్జున సినిమాల ఎంపిక విషయంలో చాలా మార్పులు వచ్చాయి.నాగార్జున కెరీర్‌లో ఇక రొమాంటిక్‌ సినిమాలు చేయవద్దని నిర్ణయానికి వచ్చాడట.అందుకే బంగార్రాజు సినిమాను పక్కకు పెట్టేసినట్లుగా సమాచారం అందుతోంది.

ఈ నేపథ్యంలోనే కళ్యాణ్‌ కృష్ణ పరిస్థితి ఏంటని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రెండేళ్ల పాటు కళ్యాణ్‌ కృష్ణను మరో సినిమా చేసుకోనివ్వకుండా కెరీర్‌ నాశనం చేశారంటూ విమర్శలు వస్తున్నాయి.

అయితే అక్కినేని వారు మాత్రం కళ్యాణ్‌ కృష్ణతో బంగార్రాజు కాకుండా మరేదైనా సినిమాను ప్లాన్‌ చేస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube