నాగార్జునది కాన్ఫిడెన్సా? ఓవర్‌ కాన్ఫిడెన్సా?

నాగార్జున ఆరు పదుల వయసులో పడబోతున్నాడు.ఈ వయసులో ఆయన లవ్‌ స్టోరీలు చేసేందుకు సిద్దం అయ్యాడు.

 Akkineni Nagarjuna All Hopes On Manmadhudu 2-TeluguStop.com

లవ్‌ స్టోరీలు చేసేందుకు యంగ్‌ స్టార్‌ హీరోలే ఆసక్తి చూపని ఈ సమయంలో ఆరు పదుల వయసులో నాగార్జున చేసేందుకు ముందుకు రావడం అది కూడా మన్మధుడు అనే టైటిల్‌తో చేయడం కాస్త ఆసక్తికరంగా మారింది.మన్మధుడు 2 చిత్రంను ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రంపై నాగార్జున చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు.

నాగార్జునది కాన్ఫిడెన్సా? ఓవ

తాజాగా సినిమా ప్రమోషనల్‌ ప్రెస్‌ మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ మజిలీ చిత్రంతో మా పెద్దబ్బాయి సక్సెస్‌ కొట్టాడు.ఓ బేబీ అంటూ నా కోడలు సక్సెస్‌ కొట్టింది.ఈ ఏడాది మా ఫ్యామిలీ నుండి నేను వారిద్దరి సినిమాలను మించి సక్సెస్‌ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేశాను.

తప్పకుండా ‘మన్మధుడు 2’ చిత్రం మజిలీ మరియు ఓబేబీ చిత్రాల కంటే పెద్ద హిట్‌ అవుతుందని నాగార్జున చాలా నమ్మకంగా ఉన్నాడు.

నాగార్జునది కాన్ఫిడెన్సా? ఓవ

నాగార్జునకు జోడీగా ఈ చిత్రంలో ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ తెరకెక్కడంతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి భారీగానే ఉంది.దాంతో సినిమా గతంలో నాగ్‌ సినిమాలను మించి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది.

నాగార్జునకు విడుదలకు ముందు భారీ లాభాలు దక్కినట్లుగా సమాచారం అందుతోంది.నాగార్జున ఈ చిత్రం విషయంలో చాలా పాజిటివ్‌గా అనిపిస్తున్నాడు.

గత సినిమాల కంటే నాగ్‌ ఈ సినిమాపై కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తున్నాడు.మరి ఆయనది కాన్ఫిడెన్సా లేదా ఓవర్‌ కాన్ఫిడెన్సా అనేది తెలియాలి అంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube