సమంత బెస్ట్ ఫ్రెండ్ తో చైతూ సినిమా.. సామ్ ప్లేస్ లో హీరోయిన్ ఎవరంటే?

గత కొన్ని రోజుల క్రితం నాగచైతన్య సమంత విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఈ క్రమంలోని ఈ ప్రకటన తర్వాత సమంత కొంతవరకు భావోద్వేగమైన తర్వాత తన పనిలో తాను బిజీగా ఉన్నారు.

 Akkineni Nagachaitanya Film With Nandini Reddy Finalised-TeluguStop.com

ఇక నాగచైతన్య కూడా లవ్ స్టోరీ సినిమా విజయవంతం కావడంతో తన తర్వాత సినిమాలపై తన దృష్టి సారించారు.ఇలా విడాకులు ప్రకటన అనంతరం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.

తాజాగా నాగచైతన్య గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 Akkineni Nagachaitanya Film With Nandini Reddy Finalised-సమంత బెస్ట్ ఫ్రెండ్ తో చైతూ సినిమా.. సామ్ ప్లేస్ లో హీరోయిన్ ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాగ చైతన్య నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి.

అయితే ఈ సినిమా సమంత నాగచైతన్య విడాకుల ప్రకటన వెలువడక ముందే చేయాలని ప్లాన్ చేశారు.అప్పుడు నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్ గా చేయాలని దర్శకురాలు నందినిరెడ్డి భావించారు.

వ్యక్తిగతంగా సమంతకు నందినిరెడ్డి ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం మనకు తెలిసిందే.నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత జబర్దస్త్ ,ఓబేబి అనే సినిమాలను చేసింది.అదేవిధంగా ఆహాలో సమంత నిర్వహించిన సామ్ జామ్ అనే టాక్ షోకి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు.

Telugu Director Nandini Reddy, Film Industry, Finalised, Movie News, Naga Chaitanya, Nandini Reddy, Samantha Naga Chaitanya Divorce, Tollywood-Movie

ఇలా పెళ్లికి ముందు పలు సినిమాలలో నటించి హిట్ ఫెయిర్ అనిపించుకున్న ఈ జంట పెళ్లి తర్వాత మజిలీ సినిమా మాత్రమే చేశారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఇకపోతే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ సమంత అని భావించారు.

ప్రస్తుతం వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించడంతో ఇందులో సమంత స్థానంలో మరొక హీరోయిన్ ను తీసుకోవాలనే ఆలోచనలో నందిని రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.మరి ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయం అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది.

#Nandini Reddy #SamanthaNaga #Naga Chaitanya #Nandini Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube