అక్కినేని యువ సామ్రాట్ గా నాగచైతన్య తెలుగు అరంగ్రేటం చేసిన సంగతి మనకు తెలిసినదే.ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ్ స్టోరీ” సినిమాలో నటిస్తున్నారు.
అయితే ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా నాగచైతన్య తన 34 వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేశారు.
ఇందులో నాగచైతన్య లుంగీ కట్టి అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నారు.అయితే ఈ పోస్టర్ ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ తన భర్త నాగచైతన్యకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.”ఎల్లప్పుడూ నీ సొంత ఆలోచనలతో ఇలాగే ముందుకెళ్ళు… నీకు నచ్చినట్లుగా హాయిగా జీవించు” అంటూ ఎంతో ప్రత్యేకంగా తనకు శుభాకాంక్షలను సమంత తెలియజేశారు.సమంత చేసిన ఈ ట్వీట్ చూసిన అక్కినేని ఫ్యాన్స్ సూపర్… అంటూ పెద్ద ఎత్తున నాగచైతన్యకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు.

మజిలీ సినిమాతో హిట్ సొంతం చేసుకున్న నాగచైతన్య, ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరోయిన్ సాయి పల్లవితో జతకట్టి లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నారు.నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది.థియేటర్లు ఓపెన్ కాక పోవడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుంది.
అయితే చైతన్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో లుంగీ, బనియన్ ధరించి నాగచైతన్య కనిపించడంతో ఈ సినిమాలో నిత్య జీవితంలో మనం జీవించే ఓ సాధారణ యువకుడి పాత్రలో నాగచైతన్య కనిపించనున్నట్లు ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.అయితే ప్రస్తుతం నాగచైతన్య ఈ లుక్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, దేవయాని, ఈశ్వరిరావు పలు కీలక పాత్రలో నటిస్తున్నారు.