నాగచైతన్య 10 ఏళ్ల కెరీర్‌లో 12 ఫ్లాప్‌లు, మరి సక్సెస్‌లు ఎన్నో తెలుసా?

అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున నట వారసుడిగా నాగచైతన్య సినీరంగ ప్రవేశం చేసి 10 ఏళ్లు అవుతోంది.చైతూ మొదటి చిత్రం జోష్‌ విడుదల అయ్యి పదేళ్లు అయిన సందర్బంగా అక్కినేని ఫ్యాన్స్‌ నాగచైతన్య సినీ కెరీర్‌ 10 ఏళ్లు అంటూ సోషల్‌ మీడియాలో హ్యాష్‌ ట్యాగ్‌ క్రియేటష్‌ చేసి ట్రెండ్‌ చేస్తున్నారు.

 Akkineni Naga Chaitanya Plops And Success In Industry Majili 100 Love-TeluguStop.com

అక్కినేని అభిమానులు ఈ విషయాన్ని వేడుక మాదిరిగా చేసుకుంటున్నారు.ఇక నాగచైతన్య ఈ 10 ఏళ్ల సినీ కెరీర్‌ను ఒకసారి చూసినట్లయితే హిట్స్‌ కంటే ఫ్లాప్స్‌ ఎక్కువగా ఉన్నాయి.

Telugu Akkineni, Akkineninaga, Nagarjuna-

నాగచైతన్య తన కెరీర్‌లో హీరోగా ఇప్పటి వరకు 17 సినిమాలు చేశాడు.ఆ సినిమాల్లో 12 సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి.చైతూ మొదటి సినిమా జోష్‌ తోనే ఫ్లాప్‌ల ఖాతా తెరిచాడు.ఆ సినిమా అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది.శివ స్థాయిలో ఆడుతుందేమో అనుకుంటే అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.ఆ తర్వాత ‘ఏమాయ చేశావే’ మరియు ‘100% లవ్‌’ చిత్రాలు ఆడాయి.

చైతూకు ఆ రెండు చిత్రాలు కూడా ఒక మోస్తరు సక్సెస్‌లను తెచ్చి పెట్టడంతో పాటు స్టార్‌డంను కూడా తెచ్చి పెట్టాయి.దాంతో అక్కడ నుండి చైతూ ఫ్లాప్స్‌ హిట్స్‌ కలగలిపి చేస్తూ వస్తున్నాయి.

నాగచైతన్య కెరీర్‌లో చెప్పుకోగద్ద చిత్రాలుగా అయిదు చిత్రాలు నిలిచాయి.

చైతూకు మొదటి సక్సెస్‌గా నిలిచిన చిత్రం ‘ఏమాయ చేశావే’, ఆ వెంటనే చేసిన ‘100%లవ్‌’ చిత్రం.

ఈ రెండు చిత్రాల తర్వాత చైతూ మూడవ సక్సెస్‌ను ‘మనం’తో అందుకున్నాడు.మళ్లీ నాల్గవ సక్సెస్‌కు చైతూ మూడు సంవత్సరాలు ఎదురు చూసి ‘ప్రేమమ్‌’తో పర్వాలేదు అన్నట్లుగా సక్సెస్‌ను అందుకున్నాడు.

ఇక ఈ ఏడాది ‘మజిలీ’ చిత్రంతో తన కెరీర్‌లో అయిదవ సక్సెస్‌ను దక్కించుకున్నాడు.ఈ అయిదు సక్సెస్‌లను పరిశీలించినట్లయితే బ్లాక్‌ బస్టర్‌ రికార్డు బ్రేకింగ్‌ సక్సెస్‌లు కూడా ఏమీ కాదు.

Telugu Akkineni, Akkineninaga, Nagarjuna-

చైతూ ఇంకా మంచి సక్సెస్‌లను అందుకోవాల్సిన అవసరం ఉంది.ఈ పదేళ్లలో కేవలం అయిదు సక్సెస్‌లు అంటే చాలా దారుణమైన విషయం.బ్యాక్‌ గ్రౌండ్‌ లేని హీరో అయితే కనిపించకుండా పోయేవాడు.అక్కినేని, దగ్గుబాటి వారి వారసుడు అవ్వడం వల్ల కొనసాగుతున్నాడు.ప్రస్తుతం మేనమామ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీమామ’ చిత్రంలో చైతూ నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube